Advertisementt

లీకైన తాప్సి పెళ్లి వీడియో

Wed 03rd Apr 2024 07:41 PM
taapsee pannu  లీకైన తాప్సి పెళ్లి వీడియో
Taapsee Mathias Boe wedding video leaked లీకైన తాప్సి పెళ్లి వీడియో
Advertisement
Ads by CJ

ఢిల్లీ భామ తాప్సి పన్ను బాలీవుడ్ లో కెరీర్ ని మలుచుకుంటూ బాయ్ ఫ్రెండ్ తో చేట్టాట్టలేసుకుని తిరుగుతూ ఫైనల్ గా సీక్రెట్ గా పెళ్లి పీటలెక్కింది. మార్చ్ 23 న రాజస్థాన్ ఉదయ్ పూర్ లో తాప్సి ఆమె ప్రేమిస్తున్న డెన్మార్క్ బ్యాట్మెంటన్ ప్లేయర్ మథియాస్ బోను వివాహమాడినట్లుగా సోషల్ మీడియాలో గుప్పుమంది. కానీ తాప్సి మాత్రం తన పెళ్లి మేటర్ బయటికి రాకుండా దాచేసింది. పెళ్లి తర్వాత సారీ పై బ్లాక్ కలర్ సూట్ వేసుకుని పిక్స్ షేర్ చేసినా.. షాదీ పై ఎటువంటి కామెంట్స్ చెయ్యలేదు. 

అయితే తాజాగా తాప్సి-మథియాస్ బో ల పెళ్లి వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. పెళ్లి కూతురిగా రెడీ అయిన తాప్సి డాన్స్ చేస్తూ పెళ్లి కొడుకు దగ్గరకి చేరిన వీడియో అది. ఇక ఆ వీడియో చూస్తే తాప్సి పెళ్లి చాలా సింపుల్ జరిగిపోయింది అనేలా ఉంది. తాప్సి కూడా ఓ అన్నంత డిజైనర్ వేర్ డ్రెస్సులో కాకుండా వాళ్ళ సాంప్రదాయ దుస్తుల్లో కనిపించింది. 

ఇక పెళ్లి మండపం కూడా చాలా సింపుల్ గా డెకరేట్ చేసారు. తాప్సి పెళ్ళిలో బంధువులు కూడా తక్కువమంది కనిపింఛారు. ఇది చూసిన నెటిజెన్స్ సీక్రెట్ గా చేసుకోవడమే కాదు, చాలా సింపుల్ గా తాప్సి పెళ్లి జరిగిపోయింది, ఎటువంటి హంగు ఆర్భాటాలకు పోకుండా తాప్సి ఇంత సింపుల్ గా పెళ్లి చేసుకుందేంటి అంటూ నెటిజెన్స్ ఆరాలు కూడా తీస్తున్నారు. 

Taapsee Mathias Boe wedding video leaked:

Taapsee Pannu-Mathias Boe wedding video goes viral

Tags:   TAAPSEE PANNU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ