Advertisementt

విశ్వక్ గామి ఓటీటీ డేట్ వచ్చేస్తోంది...

Wed 03rd Apr 2024 10:25 AM
gaami  విశ్వక్ గామి ఓటీటీ డేట్ వచ్చేస్తోంది...
Gaami OTT date is coming... విశ్వక్ గామి ఓటీటీ డేట్ వచ్చేస్తోంది...
Advertisement
Ads by CJ

విశ్వక్ సేన్ లేటెస్ట్ చిత్రం గామి. ఈ చిత్రం భారీ అంచనాల నడుమ మహా శివరాత్రి సందర్భంగా మార్చ్ 8 న థియేటర్స్ లో విడుదలైంది. విడుదలైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవడంతో గామి తో విశ్వక్ సేన్ ఖాతాలో హిట్ చేరింది. ఇంట్రెస్టింగ్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కిన గామీ చిత్రం మొదటి వీకెండ్ లోనే చెప్పుకోదగ్గ కల్లెక్షన్స్ కలెక్ట్ చేసింది. ఈ చిత్రాన్ని విశ్వక్ చాలా ప్రస్టేజియస్ ఇష్యుగా తీసుకుని పబ్లిసిటీ చేసాడు.

అయితే థియేటర్స్ లో గామి చిత్రం హిట్ అవడంతో.. దానిని చూడడం మిస్ అయిన ప్రేక్షకులు ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. గామి చిత్ర డిజిటల్ హక్కులు ప్రముఖ సంస్థ జీ 5 వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మార్చ్ 8 న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం ఏప్రిల్ 5 అంటే ఈ శుక్రవారమే ఓటీటీలోకి వస్తుంది అని అందరూ భవించారు.

కానీ విశ్వక్ సేన్ గామి నిర్మాతలు మాత్రం ఏప్రిల్ 2 నుండి ఓటిటిలో స్ట్రీమింగ్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ తేదీ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. 

Gaami OTT date is coming...:

Gaami ott premier date locked

Tags:   GAAMI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ