అనుపమ పరమేశ్వరన్ ఒకప్పుడు చాలా క్యూట్ గా సాంప్రదాయంగా ఉండేది. ట్రెడిషనల్ డ్రెస్సెస్ అంటే సారీస్, చుడీదార్స్ లో హోమ్లీ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో పాతుకుపోయింది. ఆమె నటించే సినిమాలే కానివ్వండి, సోషల్ మీడియాలో షేర్ చేసే పిక్స్ కానివ్వండి.. ఎక్కడా గ్లామర్ షో అన్న పదానికి తావిచ్చేది కాదు. అంత చక్కగా అనుపమ పరమేశ్వరన్ ఆకట్టుకునేది. అలా మడి కట్టుకుని కూర్చున్నందుకే ఆమెకి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రాలేదనే అనుకున్నారు.
అందుకేనేమో అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు గ్లామర్ పాత్రల వైపు, బోల్డ్ కేరెక్టర్స్ వైపు మొగ్గు చూపుతుంది. దిల్ రాజు సోదరుడి కొడుకు ఆశిష్ తో కలిసి ముద్దులతో చెలరేగిపోయిన అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు టిల్లు స్క్వేర్ లో సిద్దు జొన్నలగడ్డతో రొమాన్స్ తో రెచ్చిపోయింది. చిట్టి పొట్టి డ్రెస్సులతో బోల్డ్ కేరెక్టర్ లో సిద్దు తో అనుపమ ఘాటు రొమాన్స్ బాగా హైలెట్ అయ్యింది. లిల్లీ పాత్ర అనుపమ కోసమే రాశారా అన్నంతగా పాపులర్ అయ్యింది. అయితే అనుపమ గ్లామర్ షో విషయంలో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
అనుపమని అలా చూడలేకపోతున్నామంటూ సోషల్ మీడియాలో గోడు వెళ్లబోసుకుంటున్నారు. టిల్లు స్క్వేర్ పోస్టర్స్ చూసి అనుపమని ట్రోల్ చేసిన వారు ఉన్నారు. అదాలాఉంటే టిల్లు స్క్వేర్ థియేటర్స్ లో సూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతున్న సమయంలో అనుపమ సడన్ గా ట్రెడిషనల్ గా శారీ లో దర్శనమిచ్చింది. చాలా అంటే చాలా హోమ్లీ గా అనుపమ శారీ లుక్స్ ఉన్నాయి. అది చూసిన వారు అను బేబీ ఇదే కదా మాకు కావాల్సింది.. ఇలానే ఉండు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.