డీజే టిల్లు కి సీక్వెల్ గా తెరకెక్కిన టిల్లు స్క్వేర్ సూపర్ హిట్ కాదు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలా కనబడుతుంది. మొదటి వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ దిశగా పరుగులు తీసిన టిల్లు స్క్వేర్ లో అనుపమ పరమేశ్వరన్ లిల్లిగా బాగా ఆకట్టుకుంది. ఆమె మొదటిసారి ఇలాంటి గ్లామర్ మరియు నెగెటివ్ రోల్ లో కనిపించడం జీర్ణించుకోలేని వాళ్ళు నెగెటీవ్ కామెంట్స్ చేసినా అనుపమ మాత్రం సిద్దు జొన్నలగడ్డతో పోటీ పడి నటించి శెభాష్ అనిపించుకుంది.
అనుపమ పరమేశ్వరన్ ఇలాంటి గ్లామర్ అంటే బోల్డ్ కేరెక్టర్ చేయడంపై ఆమె అభిమానుల్లో చాలా వ్యతిరేఖత కనిపించింది. అయితే ఇప్పుడు ఆ సినిమా హిట్ అవడంతో అందరూ లిల్లిగా అనుపమని పోగిడేస్తూన్నారు. కాకపోతే లిల్లీ పాత్ర కోసం ముందుగా అనుపమని అనుకోలేదట. ఆ పాత్ర కోసం చాలామంది హీరోయిన్స్ ని అప్రోచ్ అవ్వగా వారంతా రిజెక్ట్ చేశారట. అందులో ముఖ్యంగా బ్యూటిఫుల్ తార శ్రీలీలని మేకర్స్ ముందుగా సంప్రదించారట. కానీ ఆమెకి డేట్స్ ఖాళీ లేవని లిల్లీ పాత్రని రిజెక్ట్ చెయ్యడంతో ఆ పాత్ర అనుపమ పరమేశ్వరన్ కి తగిలింది. అదృష్టం ఆమెకి కలిసొచ్చింది అని ఇప్పుడర్ధం అవుతుంది.
అయితే అప్పట్లో శ్రీలీలకి డేట్స్ కాదు.. ఆమెకి లిల్లీ కేరెక్టర్ నచ్చకే రిజెక్ట్ చేసింది అనే ప్రచారం జరిగింది.
వరసగా యంగ్ హీరోల ఆఫర్స్ ని అందుకుని శ్రీలీల వాటితో డిజాస్టర్స్ ని సొంతం చేసుకుంది. కానీ హిట్టయ్యే సినిమాని ఆ డిజాస్టర్స్ కోసం వదులుకుని పెద్ద తప్పు చేసింది, బ్లాక్ బస్టర్ అవకాశాన్ని మిస్ చేసుకుంది. అసలు ఒప్పుకుని ఉంటె లిల్లిగా శ్రీలీల ఎలా ఉండేదో అంటూ ఆమె అభిమానులు ఇప్పుడు తెగ ఫీలైపోతున్నారు.