అల్లు అర్జున్ కోలీవుడ్ టాప్ డైరెక్టర్ అట్లీ తో సినిమాకి కమిట్ అయ్యారనే న్యూస్ ఎప్పటినుంచో వినిపిస్తోంది. ఈ కాంబోకి అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్ అంటూ ప్రచారం జరుగుతుంది. అందుకే ఈ కాంబోకి AAA అనే పేరు కూడా పెట్టారు. మరి ఈ కాంబో పై అఫీషియల్ ప్రకటన అల్లు అర్జున్ పుట్టిన రోజు ఏప్రిల్ 8 కి రావొచ్చని ఊహగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అయితే అల్లు అర్జున్-అట్లీ కాంబో మూవీ పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతుంది.. ఈ చిత్రం కోసం అట్లీ అప్పుడే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉండడమే కాదు నటుల వేటలో పడ్డాడు అని తెలుస్తోంది, అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఇది వరకు త్రిష పేరు వినిపించింది. కానీ సడెన్ గా ఇప్పుడు సమంత పేరు ఖాయమైందంటూ వార్తలొస్తున్నాయి. AAA లో అసలు ట్విస్ట్ ఏమిటంటే ఈచిత్రంలో ఒకరు కాదు, ఇద్దరు హీరోయిన్లు కనిపించే అవకాశం ఉందట. అట్లీ ఆ ఇద్దరు హీరోయిన్స్ ని సెట్ చేసే పనిలో ఉన్నాడట.
అందుకే త్రిష, సమంతని హీరోయిన్స్ గా అల్లు అర్జున్ సినిమా కోసం ఫైనల్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. అల్లు అర్జున్ సమంత తో సన్ ఆఫ్ సత్యమూర్తిలో స్క్రీన్ షేర్ చేసుకున్నా.. త్రిషతో మాత్రం జోడి కడితే ఇదే ఫస్ట్ టైం అవుతుంది. అయితే త్రిషది హీరోయిన్ పాత్ర కాదు అనే టాక్ కూడా వినిపిస్తోంది.