Advertisementt

బర్త్ డే కయినా గుడ్ న్యూస్ ఉంటుందా అఖిల్

Tue 02nd Apr 2024 11:04 AM
akhil akkineni  బర్త్ డే కయినా గుడ్ న్యూస్ ఉంటుందా అఖిల్
Is there any good news on birthday Akhil? బర్త్ డే కయినా గుడ్ న్యూస్ ఉంటుందా అఖిల్
Advertisement
Ads by CJ

అఖిల్ అక్కినేని సినిమాల్లో కనిపించి ఏడాది పూర్తవుతుంది. ఏజెంట్ తర్వాత అఖిల్ కొత్త సినిమా ఇంకా మొదలు పెట్టలేదు. ఏజెంట్ విడుదలై ఏప్రిల్ 30 కి ఏడాది పూర్తవుతుంది. ఇంకా అఖిల్ ఏజెంట్ డిసాస్టర్ నుంచి కోలుకోలేదా? నాగార్జున అఖిల్ విషయంగా ఏం ఆలోచిస్తున్నారో అనేది అక్కినేని అభిమానులకి అంతుబట్టడం లేదు. అఖిల్ CCL తర్వాత మళ్ళీ కనిపించలేదు. ఈ ఏడాది కాలంగా అఖిల్ మూడు నాలుగు సందర్భాల్లో మాత్రమే మీడియా కి దర్శనమిచ్చాడు. 

అయితే అఖిల్ పుట్టిన రోజు నాడైనా అఖిల్ కొత్త ప్రాజెక్ట్ శుభవార్త వింటామా అనే ఆతృతలో అక్కినేని అభిమానులు కనబడుతున్నారు. అఖిల్ ఆరడుగుల అందగాడు. ఒక మంచి కథ దొరోకితే స్టార్ హీరోల లిస్ట్ లోకి చేరిపోతాడు అని అభిమానులు దేవుడిని ప్రార్థిస్తున్నారు. కానీ అఖిల్ కొత్త ప్రాజెక్ట్ విషయమే ఎటు తేల్చకుండా ఇంకా సస్పెన్స్ లోనే ఉంచుతున్నారు.

అఖిల్ అక్కినేని బర్త్ డే ఏప్రిల్ 8. అంటే ఇంకా వారం మాత్రమే సమయం ఉంది. మరి అఖిల్ బర్త్ డే కి కొత్త ప్రోజెక్ట్ ఎనౌన్స్ చేస్తాడో ఇంకా సైలెంట్ గానే ఉంటాడో అని అభిమానులు ఆత్రుత పడిపోతున్నారు. మరి అఖిల్ అనిల్ కుమార్ ని కొత్త దర్శకుడిగా పరిచయం చేస్తాడు, అఖిల్-అనిల్ కాంబో మూవీకి ధీర అనే టైటిల్ కూడా సెట్ అయ్యింది అనే ప్రచారం జరిగింది. మరి ఈ కాంబో పై ఏప్రిల్ 8 న ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. 

Is there any good news on birthday Akhil?:

Latest News on Akhil Akkinenis Birthday

Tags:   AKHIL AKKINENI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ