Advertisementt

నాకు నేనే శిక్ష వేసుకున్నా : విజయ్

Mon 01st Apr 2024 04:18 PM
family star  నాకు నేనే శిక్ష వేసుకున్నా : విజయ్
Even if I punish myself : Vijay Devarakonda నాకు నేనే శిక్ష వేసుకున్నా : విజయ్
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన పాన్ ఇండియా ఫిలిం లైగర్ చిత్రం ముందు వరకు చాలా యాటిట్యూడ్ చూపించేవాడు. లైగర్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనే కాన్ఫిడెంట్ లో విజయ్ అప్పట్లో చాలా మాట్లాడేసాడు. ఆ తర్వాత అంటే లైగర్ డిసాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ ఎలా ఉన్నా అతను మాత్రం చాలా కామ్ అయ్యాడు. 

ఖుషి ప్రమోషన్స్ లోను డీసెంట్ గా కనిపించాడు. ఇక ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో చెప్పక్కర్లేదు. పద్దతికి మారు పేరు విజయ్ అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. ఈరోజు జరిగిన మీడియా మీట్ లో విజయ్ దేవరకొండ పంచె కట్టుకుని ట్రెడిషనల్ గా కనిపించాడు. 

ఫ్యామిలీ స్టార్ మీడియా మీట్ లో విజయ్ దేవరకొండ ని మీడియా వారు అడిగిన కొన్ని ప్రశ్నలకి సరదాగా సమాధానమిచ్చాడు. అందులో లైగర్ తర్వాత తాను సినిమా రిజల్ట్ ని డిక్లెర్ చెయ్యడం లేదు, ఒక మూడు సినిమాల వరకు మూసుకుని కూర్చుంటా అని నాకు నేనే శిక్ష వేసుకున్నాను అంటూ విజయ్ చెప్పుకొచ్చాడు. ఒకటి రెండు హిట్స్ కొట్టాకే మళ్ళీ తానేంటో చూపిస్తాను అని చెప్పకనే చెప్పేసాడు విజయ్ దేవరకొండ అంటూ మీడియా వారు మాట్లాడుకుంటున్నారు. 

Even if I punish myself : Vijay Devarakonda:

Family Star Pre-Release Press Meet 

Tags:   FAMILY STAR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ