జబర్దస్త్ కామెడీ షో కి ఒకప్పుడు అనసూయ-రష్మీ గౌతమ్ అందాలు, వాళ్ళ యాంకరింగ్ కామెడీ ప్రియులకి విపరీతంగా నచ్చేసేది. అనసూయ అందాలు జబర్దస్త్ కి అదనపు ఆకర్షణగా నిలిచేవి. ఆమె డాన్స్, షో మధ్యలో అనసూయ స్కిట్స్ లో చేసే హడావిడి అంతా ఆ షోకి ఆకర్షణే. కానీ అనసూయ సినిమాల్లో బిజీ అవడంతో జబర్దస్త్ ని వదిలేసింది. ఆమె స్థానంలోకి కన్నడ అమ్మాయి సౌమ్య రావు వచ్చి చేరింది. ఆమెకి తెలుగు రాదు, అంత గ్లామర్ కూడా లేదు, డాన్స్ అస్సలే రాదు.
ఓ ఏడాది పాటు సౌమ్య రావు కూడా జబర్దస్త్ లో సందడి చేసింది. అయితే సౌమ్య రావు ని యజమాన్యం తప్పించిందో లేదంటే ఆమె జబర్దస్త్ నుంచి తప్పకుందో కాని ఆమె స్థానంలోకి బిగ్ బాస్ ఫేమ్ సిరి హన్మంత్ వచ్చింది. సిరి గ్లామర్ గా జబర్దస్త్ స్టేజ్ పై మెస్మరైజ్ చేస్తుంది. ఆమె యాంకరింగ్ కన్నా ఆమె అందమే హైలెట్ అనేలా ఉంది.
వారం వారం సిరి జబర్దస్త్ స్టేజ్ పై అందంగా డాన్స్ చేస్తూ హంగామా చేస్తుంది. కమెడియన్స్ తో మింగిల్ అవుతూ సరదాగా కనబడుతుంది. తాజాగా సిరి ఇన్స్టా లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. ఆ పిక్స్ లో శారీ కట్టుకుని సిరి హన్మంత్ బ్యూటిఫుల్ గా కనిపించింది. లూజ్ హెయిర్ తో సింపుల్ లుక్స్ అయినా.. ఆమె అందాల గురించి అభిమానులు మాట్లాడుకునేలా ఆ ఫోటో షూట్ ఉంది.