యూత్ లో టిల్లు స్టార్ బాయ్ సిద్దూకి ఇప్పుడు విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. డీజే టిల్లు అంటూ పెద్దమనిషి ఫంక్షన్స్ కి డీజే వాయించిన సిద్దు జొన్నలగడ్డ ఆ చిత్రంలో నేహా శెట్టితో రొమాన్స్ చేసాడు. సిద్ధుని ముగ్గులోకి దింపి డబ్బు తీసుకుని పారిపోయే ప్రాసెస్ లో సిద్దు జొన్నలగడ్డకి నేహా శెట్టికి మద్యన ఘాటైన రొమాన్స్ చూపించారు. నేహా శెట్టి చీరలోనే హాట్ గా గ్లామర్ చూపించింది. టిల్లు తో కలిసి ముద్దులతో రెచ్చిపోయింది. సిద్దు-రాధికా కనిపించిన ప్రతి సీన్ పండింది. ఆ మాట నువ్వే అడుగుతున్నావా రాధికా అంటూ సిద్దు మాట్లాడిన డైలాగ్స్ తెగ పాపులర్ అయ్యాయి.
ఇక డీజే టిల్లు కి సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా సిద్దు జొన్నలగడ్డతో రొమాన్స్ చేసింది. అనుపమ మొదటిసారి గ్లామర్ షో చెయ్యడం, ముద్దులతో ముంచెత్తడం చూసి ఆమె అభిమానులు షాకైపోయారు. అయితే డీజే టిల్లు లో రాధికా గా నేహా శెట్టి యాక్టింగ్, ఆమె గ్లామర్, సిద్ధుతో రాధికా రొమాన్స్ నచ్చాయా, టిల్లు స్క్వేర్ లో అనుపమ యాక్టింగ్ అండ్ గ్లామర్ షో, సిద్దు తో రొమాంటిక్ యాంగిల్ బావుందా అని అడిగితే.. రాధికగా నేహా శెట్టి గ్లామర్, ఆమె సిద్దు తో చేసిన రొమాన్స్ బావుంది అంటున్నారు.
అనుపమని ఎప్పడు హోమ్లీగా చూసి నెగెటివ్ కేరెక్టర్స్ లో తక్కువ చూడడం వలన లిల్లీ కేరెక్టర్ ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాము, అదే నేహా శెట్టి అయితే మొదటి నుంచి గ్లామర్ గా ప్రొజెక్ట్ అయ్యింది. ఆమె నెగెటివ్ కేరెక్టర్ చాలా బావుంది, అదే అనుపమ నెగెటివ్ రోల్ లో ఆకట్టుకోలేదు అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.