Advertisementt

నిస్వార్ధంగా ప్రభాస్ సేవ

Sun 31st Mar 2024 07:25 PM
prabhas  నిస్వార్ధంగా ప్రభాస్ సేవ
Selfless service of Prabhas నిస్వార్ధంగా ప్రభాస్ సేవ
Advertisement
Ads by CJ

చాలామంది హీరోలు ఎవ్వరైనా ఇతరులకి సహాయం కానీ,సేవ కానీ ఏది చేసినా అందులో పబ్లిసిటీ కోరుకుంటారు. అంతెందుకు స్టార్ హీరోలు అభిమానులని హత్తుకుంటేనే వారి పీఆర్వోలు దానినో సెన్సేషన్ చేస్తారు. అభిమానిని కలిసి మాట్లాడారు ఈ హీరో అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తారు. ఇక ఆయా హీరోలు ఎవరికైనా డబ్బు సాయం కానీ, మాట సాయం కానీ చేస్తే దాని గురించి పబ్లిసిటీ మాములుగా ఉండదు. 

కానీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాత్రం అలాంటి పబ్లిసిటీ కోరుకోరు. గతంలో ప్రభాస్ ఓ వీరాభిమాని మరణం అంచున చేరుకొని ప్రభాస్ ని కలిసి ఫోటో దిగాలని కోరుకుంటే.. ప్రభాస్ అప్పటికప్పుడు తన షెడ్యూల్స్ అన్ని వాయిదా వేసుకుని ఆ అభిమానిని కలిసి అతని కిష్టమైన ఫుడ్ కూడా ఇచ్చారు. ఆ విషయం ఆ అభిమాని పేరెంట్స్ చెప్పేవరకు ఎవ్వరికి తెలియదు. గతంలోనూ ప్రభాస్ వృద్ధాశ్రమం నిర్మించడంలో సహాయం కోసం అర్ధించగా రెండు కోట్లు సహాయం చేసిన విషయం ఎవ్వరికి తెలియదు. 

తాజాగా నటుడు శివాజీ రాజా ప్రభాస్ చేసిన ఈ పెద్ద సహాయం గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. శివాజీ రాజా కొందరితో కలిసి వృద్దాశ్రమం నిర్మించేటప్పుడు ప్రభాస్ ని సహాయం అడగడానికి వెళ్లగా వెంటనే రెండు కోట్లు ఆ వృద్ధాశ్రమానికి విరాళం ఇచ్చినట్టుగా ఆ ఇంటర్వ్యూలో చెప్పడం హైలెట్ అయ్యింది. ప్రభాస్ ఇలాంటి సహాయాలు చాలా చేసినా అవి ఎవ్వరికి తెలియవు, అవి తెలియడానికి ఏళ్ళకి ఏళ్ళు పడుతుంది అంటూ ఆయన సన్నిహితులు చెప్పడం గమనార్హం. మరి రెండు కోట్ల ఎమౌంట్ చిన్న విషయం కాదు, కానీ ప్రభాస్ మాత్రం నిస్వార్థంగా సేవ చేస్తూ ఎలాంటి పబ్లిసిటీ కోరుకోకపోవడం ఆయన్ని మరింత ఉన్నతస్థానంలో నిలబెట్టింది.. అంటూ ఆయన ఫాన్స్ మాట్లాడుకుంటున్నారు. 

Selfless service of Prabhas:

Prabhas donates big to old age home

Tags:   PRABHAS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ