నాని వరస లైనప్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రస్తుతం సరిపోదా శనివారం చిత్రం చేస్తున్న నాని ఆ తర్వాత సుజిత్ అలాగే బలగం వేణు తో సినిమాలకి కమిట్ అవడమే కాదు.. నాని బర్త్ డే రోజున ఆ చిత్రాల అనౌన్సమెంట్స్ కూడా వచ్చేసాయి. ఆ నెక్స్ట్ తనకి మాస్ హిట్ అందించిన శ్రీకాంత్ ఓదెల తో మరో మూవీకి నాని పచ్చ జెండా ఊపాడనే ప్రచారాన్ని నిజం చేస్తూ వారి కాంబోలో వచ్చిన దసరా సినిమా విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా శ్రీకాంత్ ఓదెలతో నాని మరో మూవీని ప్రకటించారు.
దసరా ట్రియో అంటూ ఇంట్రెస్టింగ్ గా శ్రీకాంత్ ఓదెల-నాని-చెరుకూరి సుధాకర్ కాంబో మూవీని ప్రకటించారు. అయితే ఈ చిత్రంలోనూ హీరోయిన్ గా కీర్తి సురేష్ నే తీసుకుంటారా.. అసలు ఇది దసరాకి సీక్వెలా.. లేదంటే ఫ్రెష్ స్టోరీనా అనేది ఇప్పుడు నాని అభిమానుల్లో క్యూరియాసిటీగా మారింది. నాని-శ్రీకాంత్-నిర్మాత కాంబో అంటే హీరోయిన్ గా కీర్తి కూడా వీళ్ళతో ట్రావెల్ చేస్తే బావుంటుంది అనేది అభిమానుల కోరిక.
మరి హీరోయిన్ గా కీర్తి సురేష్ కే ఛాన్స్ ఇస్తారో లేదంటే మరో హీరోయిన్ కి ఈ ట్రియో ఛాన్స్ ఇస్తుందో అనేది ఆసక్తిగా మారింది. నానితో కీర్తి సురేష్ గతంలో నేను లోకల్, దసరా చిత్రాల్లో నటించింది.