Advertisementt

ప్రభాస్ సరసన కరీనా కాదా?

Sun 31st Mar 2024 09:59 AM
prabhas  ప్రభాస్ సరసన కరీనా కాదా?
3 top heroines being considered for Prabhas Sirit ప్రభాస్ సరసన కరీనా కాదా?
Advertisement
Ads by CJ

యానిమల్ సెన్సేషన్ సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చెయ్యబోయే స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ పనులని మొదలు పెట్టేసాడు. ప్రభాస్ ఎప్పుడెప్పుడు ఖాళీ అవుతాడా.. అప్పుడు సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లేందుకు సందీప్ రెడ్డి చూస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ ఫుల్ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడనే విషయాన్ని సందీప్ రెడ్డి వంగ ఎప్పుడో రివీల్ చేసేసాడు. అప్పటినుంచి ప్రభాస్ ని పోలీస్ లుక్ లో ఊహించుకుని అభిమానులు చాలా ఎగ్జైట్ అవుతున్నారు. 

అయితే ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కరీనా కపూర్ ని హీరోయిన్ గా అనుకున్నాడు సందీప్ వంగ అనే ప్రచారం జరిగింది. కాని ఆమె భారీ పారితోషకం డిమాండ్ చేసింది అనే టాక్ అప్పట్లో వినిపించింది. ఇప్పుడు మాత్రం అసలు కరీనా పేరు ప్రభాస్ పక్కన స్పిరిట్ లో వినిపించడం అటుంచి.. ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్స్ పేర్లు తెరపైకి వచ్చాయి. వారెవరో కాదు.. ర‌ష్మిక, కీర్తి సురేష్‌, మృణాల్ ఠాకూర్ లలో ఎవరో ఒకరిని ప్రభాస్ సరసన ఫిక్స్ చేసే ఆలోచనలో సందీప్ రెడ్డి వంగ ఉన్నాడని తెలుస్తోంది. 

మరోపక్క ప్రభాస్-హను రాఘవపూడి కలయికలో తెరకెక్కబోయే సినిమాలోనూ మృణాల్ ఠాకూర్ పేరు హీరోయిన్ గా వినిపిస్తోంది. అందులో గనక హను మృణాల్ ని ఫైనల్ చేస్తే.. సందీప్ రెడ్డి ముందు రష్మిక-కీర్తి సురేష్ మాత్రమే ఆప్షన్ గా ఉంటారట. మరి ఏ బాలీవుడ్ హీరోయిన్ నో కాకుండా సందీప్ రెడ్డికి ఇలా సౌత్ హీరోయిన్స్ వైపు చూడడం విచిత్రమే. 

స్పిరిట్ షూటింగ్ ని ఈ ఏడాది డిసెంబ‌రులో ప్రారంభించ‌డానికి సందీప్ సన్నాహాలు చేస్తున్నాడ‌ని ప్లాన్‌. ప్ర‌భాస్ కూడా డిసెంబ‌రు నుంచి నేను రెడీ అంటూ సందీప్‌కి సంకేతాలు పంపాడ‌ని తెలుస్తోంది.

3 top heroines being considered for Prabhas Sirit:

Animal movie actress in Prabhas Spirit.?

Tags:   PRABHAS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ