Advertisementt

ఈ కన్ఫ్యూజన్ ఏంటి నిఖిల్

Sat 30th Mar 2024 01:41 PM
nikhil  ఈ కన్ఫ్యూజన్ ఏంటి నిఖిల్
What is this confusion Nikhil ఈ కన్ఫ్యూజన్ ఏంటి నిఖిల్
Advertisement
Ads by CJ

హీరో నిఖిల్ టీడీపీ లో జాయిన్ అయ్యాడా.. అయ్యాడని టీడీపీ నేత నారా లోకేష్ అంటున్నారు. కానీ నిఖిల్ తన మామగారి కోసమే తెలుగు దేశానికి జై కొట్టాను, టీడీపీ లో జాయిన్ అవ్వలేదని అంటున్నాడు. అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటి నిఖిల్ అంటూ నెటిజెన్స్ తల పట్టుకుంటున్నారు. నిన్న శుక్రవారం హీరో నిఖిల్ నారా లోకేష్ ని మీటవ్వగా ఆయన నిఖిల్ మెడలో టీడీపీ కండువా కప్పి.. హీరో నిఖిల్ సిద్ధార్థ యాదవ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనకి పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాను.. అంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసారు. అలాగే నిఖిల్ కి పసుపు కండువా కప్పిన ఫొటోస్ ని షేర్ చేసారు. 

కానీ నిఖిల్ మాత్రం చీరాల నుండి TDP-JSP-Bjp కూటమి MLA టికెట్ పొందినందుకు నా మావయ్య గారు MM కొండయ్య యాదవ్ గారికి అభినందనలు.. మరియు ధన్యవాదాలు.. నారా లోకేష్ గారూ మా కుటుంభం ప్రజలకు సేవ చేసే ఈ అవకాశం ఇవ్వడం హ్యాపీగా ఉంది. మీ అందరి ఆశీస్సులు మరియు శుభాకాంక్షలు కావాలి...🙏🏽 అంటూ ట్వీట్ చేసాడు. 

ఎక్కడా తాను తెలుగు దేశం పార్టీలో జాయిన్ అయినట్లుగా కానీ, ఈ ఎన్నికల్లో తాను టీడీపీ కి ప్రచారం చేస్తాను అని కాని చెప్పకపోవడం, అటు నారా లోకేష్ నిఖిల్ టీడీపీలో జాయిన్ అయినట్లుగా చెప్పడం చూసి అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. మరి నిఖిల్ అదేదో క్లారిటీ ఇస్తే బావుండేది అనేది నెటిజెన్స్ మాట. 

What is this confusion Nikhil:

Truth in Nikhil joining TDP

Tags:   NIKHIL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ