ఇప్పటికైనా అనుపమ పరమేశ్వరన్ ని స్టార్ హీరోలు గుర్తిస్తారా? ఎందుకంటే ఒకప్పుడు హోమ్లీ హీరోయిన్ గా జస్ట్ యావరేజ్ హిట్స్ అందుకుంటూ యంగ్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న అనుపమకు ఒక్క స్టార్ హీరో అవకాశం రాలేదు. రంగస్థలం చిత్రంలో అవకాశం వచ్చినా ఆమె ఎందుకు వదులుతుందో ఇంతవరకు క్లారిటీ లేదు. ఇక కార్తీకేయ 2 లాంటి ప్యాన్ ఇండియా హిట్ మూవీలో నటించిన అనుపమ ఇప్పుడు స్టయిల్ మార్చేసింది. గ్లామర్ గా టర్నయింది.
తాజాగా డీజే టిల్లు కి సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ బిగ్గెస్ట్ హిట్ టాక్ తెచ్చుకుంది. కొద్దిరోజులుగా అంటే టిల్లు పోస్టర్స్ చూసాక అందరూ అనుపమ పరమేశ్వరన్ గురించి స్పెషల్ గా మాట్లాడుకుంటున్నారు. టిల్లు స్క్వేర్ లో సిద్దు జొన్నలగడ్డ వన్ మ్యాన్ షో చేస్తే.. అనుపమ పరమేశ్వరన్ అందాలు హైలెట్ అయ్యాయి అంటున్నారు. ఇలాంటి పాత్రలకి తాను సిద్దమే అన్న రేంజ్ లో అనుపమ గ్లామర్ గా రెచ్చిపోయింది. గ్లామర్ గా, నటన పరంగా ది బెస్ట్ అనిపించుకుంది.
అంతేకాదు.. ఈ చిత్రం సక్సెస్ అవడం ఆమెకు ప్లస్ అయ్యేలా ఉంది. మరి ఈ రేంజ్ లో అనుపమని చూసాక ఇప్పటికైనా స్టార్ హీరోలు, భారీ బడ్జెట్ మూవీస్ తీసే దర్శకనిర్మాతలు అనుపమని గురిస్తారా అనే డౌట్ లో నెటిజెన్స్ ఉన్నారు. కానీ అనుపమ అభిమానులు ఇంకా అనుపమ గ్లామర్ షాక్ నుంచి బయటికి రాలేకపోతున్నారు. చూద్దాం టిల్లు స్క్వేర్ విజయం అనుపమకి ఏ మాత్రం ఉపయోగపడుతుందో అనేది.