గత ఏడాది శ్రీలీల నటించిన చిత్రాల్లో ఒకటి రెండు హిట్ అయినా.. ఈపాటికి ఆమెకి స్టార్ స్టేటస్ సొంతమయ్యేది. స్టార్ హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి హీరోల సరసన అవకాశాలు లభించేవే. కానీ శ్రీలీల నటించిన సినిమాలన్ని వరసగా ఢమాల్ అనడంతో ఆమె ప్రస్తుతం ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే టాలీవుడ్ లో చాలా తక్కువ సమయంలో లీడింగ్ హీరోయిన్ గా స్టేటస్ ని ఎంజాయ్ చేసేది.
వచ్చిన అవకాశాలు తన కెరీర్ కి హెల్ప్ అవుతాయా? కెరీర్ ని నిలబయెడతాయో, లేదో కూడా పట్టించుకోకుండా హీరోలు, దాని బ్యానర్, పారితోషకం లెక్కలు వేసుకుని ఆ సినిమాలు ఓకె చేసింది అనిపించేలా ఆ సినిమాల్లో శ్రీలీల కేరెక్టర్స్ ఉన్నాయి. స్కంద, ఆదికేశవ, ఎక్సట్రార్డినరీ మ్యాన్, గుంటూరు కారం.. ఇందులో ఏ సినిమా చూసినా శ్రీలీల తన కేరెక్టర్ ని తానే కాపి కొట్టిన ఫీలింగ్ ప్రేక్షకుల్లో ఏర్పడింది.
అందం, అణుకువ, గ్లామర్, డాన్స్ ఎందులోనూ తక్కువ కాదు. కానీ కెరీర్ లో ఆమె చేసిన చిన్న చిన్న తప్పిదాలే ఆమె కి అవకాశాలు లేకుండా చేసింది. తాజాగా శ్రీలీల సోషల్ మీడియాలో పింక్ సారీ ఫొటోస్ ని షేర్ చేసింది. అందులో అచ్చం దేవతలా కనిపించింది. ఇంత అందమైన అమ్మాయి.. ప్రస్తుతం అవకాశాలు కొరవడి కనిపించడం ఆమె అభిమానులని వేధిస్తుంది. లీలా-సాలిడ్ సక్సెస్ దొరికేదెలా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.