యాంకర్ గా గ్లామర్ ప్రపంచాన్ని ఏలిన అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం యాంకరింగ్ ని పక్కనపెట్టేసింది. అనసూయని స్టార్ యాంకర్ గా మార్చిన జబర్దస్త్ ని ఆమె వదిలెయ్యడం అనసూయ అభిమానులకే కాదు, కామెడీ ఆడియన్స్ ఎవ్వరికి నచ్చలేదు. అనసూయ జబర్దస్త్ మానెయ్యడానికి కారణాలు అంటూ ఏవేవో ప్రచారాలు జరిగాయి. అందులో ఆమె తనపై వేసే కామెడీ డైలాగ్స్ కి హార్ట్ అయ్యి జబర్దస్త్ మానేసింది అన్నారు.
అయితే అనసూయ మాత్రం జబర్దస్హ్ కి తన డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేక మానేసాను, అంతేకాని వేరే కారణం ఏమి లేదు అంది. ఫ్యామిలీకి కాస్త టైం కేటాయించాలనుకున్నాను, అలాగే వరస సినిమాల వలన జబర్దస్త్ కి సమయం కేటాయించలేకపోతున్నాను అంటూ చెప్పింది.. కానీ అది నిజం కాదు అనేవాళ్ళు లేకపోలేదు. కారణం ఆమె జబర్దస్త్ మానేసాక స్టార్ మా స్టేజ్ పై యాంకరింగ్ చేసింది. అందుకే అనసూయ జబర్దస్త్ ని వదిలెయ్యడానికి బలమైన కారణమే ఉంది అనుకున్నారు.
తాజాగా అనసూయ తాను జబర్దస్త్ మానేయడానికి గల అసలు కారణాలను వెల్లడించింది. జబర్దస్త్ టీం వాళ్లు తనను వెళ్లిపొమ్మనలేదని.. తానే ఆ షో నుంచి తప్పుకున్నట్లుగా మరోసారి క్లారిటీ ఇచ్చింది. జబర్దస్త్ మానేయాలి అని ఆలోచించడానికి తనకు సంవత్సరన్నర సమయం పట్టిందని.. అన్ని రోజుల పాటు జబర్దస్త్ మానెయ్యాలా.. వద్దా అనే డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయని వెల్లడించింది. తన సినీ కెరియక్ పీక్స్ ఉన్న సమయంలో డేట్లు కుదరక జబర్దస్త్ టీం వాళ్లు తన వల్ల చాలా ఇబ్బంది పడ్డారని తెలిపింది.
అప్పుడు తెలుగులో మూడు, తమిళంలో మూడు సినిమాలు చేస్తూ.. షూటింగ్స్ తో బిజీగా ఉంది జబర్దస్త్ షోకు టైం కేటాయించలేకపోయానని.. తన ఒక్కదాని డేట్స్ కోసం చాలా మందిని ఆపాల్సిన పరిస్థితి రావడంతో వారు పడిన ఇబ్బందులు చూసి తనకే బాధేసిందని.. అప్పుడే తాను జబర్దస్త్ నుంచి తప్పుకుంటాని చెప్పానని అంది. ఇలా జబర్దస్త్ షోకు దూరం అయిన తనకు భవిష్యత్తులో చేయాలనిపిస్తే, కాస్త టైం దొరికినా, తనని తిరిగి జబర్దస్త్ కి రావాలని ఇప్పటికీ ప్రొడక్షన్ వాళ్లు అడుగుతున్నారని.. చెప్పుకొచ్చింది.