Advertisementt

మధు శాలిని పెళ్లయిపోయింది తెలుసా?

Fri 29th Mar 2024 10:11 AM
madhu shalini  మధు శాలిని పెళ్లయిపోయింది తెలుసా?
Madhu Shalini ties the knot with Gokul Anand మధు శాలిని పెళ్లయిపోయింది తెలుసా?
Advertisement
Ads by CJ

తెలుగు హీరోయిన్ గా తెరకి పరిచయమైన మధు శాలిని టాప్ హీరోయిన్ కాలేకపోయింది. ఒకప్పుడు వరసగా సినిమాలు చేసిన మధు శాలినికి యంగ్ హీరోలెవరు చెయ్యి అందించలేదు. అయినప్పటికీ మధు శాలిని కెరీర్ లో మంచి పొజిషన్ కి చేరుకునే ప్రయత్నం చేసింది. అయితే మొదటి నుంచి మధు శాలినిని దర్శక నిర్మాతలు లైట్ తీసుకున్నారు.

వెండితెర మీద అవకాశాలు తగ్గడంతో ఓటీటీ లోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. వెబ్ సీరీస్ లో తారకరత్నతో కలిసి నటించింది. అదలా ఉంటే మధు శాలిని ఇంకా సింగిల్. ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ లేడు, అలాగని పెళ్లి కూడా అవ్వలేదు అనుకుంటున్నారు చాలామంది. కానీ మధు శాలిని పెళ్ళైపోయింది. ఆమె భర్త మలయాళం కి చెందిన గోకుల్ ఆనంద్. మళయాళంలో పుట్టినా అతను పెరిగింది మొత్తం చెన్నై. కానీ ఇప్పుడు హైదెరాబాద్ లో సెటిల్ అయినట్లుగా చెప్పి మధు శాలిని అందరికి షాకిచ్చింది. అతను కూడా సినిమా ఇండస్ట్రీకి చెందినవాడేనట. అంటే తమళయాళినా అని ఓ యాంకర్ ప్రశ్నించగా... అవునండి తమళయాళిగు అంటే తెలుగు కూడా అంటూ మధు ఫన్నీ ఆన్సర్ ఇచ్చింది.

ఇప్పటివరకు మధు శాలినికి పెళ్లి కాలేదనుకుంటున్న వారంతా ఇప్పుడు ఆమె సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది అనే విషయం విని షాకైపోతున్నారు.

Madhu Shalini ties the knot with Gokul Anand:

Madhu Shalini Gets Married to Tamil Actor

Tags:   MADHU SHALINI