హీరో నవీన్ పోలిశెట్టికి అమెరికాలో జరిగిన బైక్ యాక్సిడెంట్ లో చేతికి ఫ్రాక్చర్ అయిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి అమెరికాలో ఉన్నాడు. అమెరికా వీధుల్లో బైక్ పై వెళ్తున్న సమయంలో స్కిడ్ అయి కింద పడిపోయినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో నవీన్ చేతికి ఫ్రాక్చర్ అయిందని చెపుతున్నారు.
నవీన్ పోలిశెట్టి కొద్ది రోజుల క్రితమే అమెరికాకు వెళ్లాడు. అక్కడ ఫ్రెండ్స్ మరియు బంధువులతో గడుపుతున్న నేపథ్యంలో నవీన్ సరదాగా బైక్‌పై వెళ్తుండగా జారి కింద పడిపోయాడని.. దీంతో నవీన్ పోలిశెట్టికి గాయాలు అయినట్లు చెప్తున్నారు. నవీన్ పోలిశెట్టికి గాయం తీవ్రత కొంచెం ఎక్కువగా ఉండటంలో రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్టు తెలుస్తోంది.
చేయి విరగడం వల్లే వాళ్లు ఈ విధమైన జాగ్రత్తను తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొంత కాలం పాటు నవీన్ పోలిశెట్టి షూటింగులకు దూరంగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే నవీన్ పోలిశెట్టి యాక్సిడెంట్ పై అతని టీం స్పందించాల్సి ఉంది.