Advertisementt

టిల్లు: హిట్ కళ కొట్టొచ్చినట్టుంది

Thu 28th Mar 2024 11:38 AM
tillu square  టిల్లు: హిట్ కళ కొట్టొచ్చినట్టుంది
Tillu Square release trailer released టిల్లు: హిట్ కళ కొట్టొచ్చినట్టుంది
Advertisement
Ads by CJ

డీజే టిల్లు తో అందరూ ముఖ్యంగా యూత్ మనసులకి బాగా దగ్గరైన సిద్దు జొన్నలగడ్డ ఆ చిత్రం తో యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో, డైలాగ్ డెలివరీ, రాధికా ఉరఫ్ నేహా శెట్టితో సిద్దు రొమాన్స్, కామెడీ అన్ని బాగా వర్కౌట్ అవడంతో ఆ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా రాధికా తో టిల్లు రొమాన్స్ ని అందరూ బాగా లైక్  చేసారు. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ వస్తుంది.

ఈ చిత్రంలోనూ ఘాటు రొమాన్స్ చేస్తున్నాడు సిద్దు. ఈసారి ఎవరూ ఉహించని భామ అనుపమ పరమేశ్వరన్ ఉరఫ్ లిల్లీ తో కలిసి టిల్లు చేసే రొమాన్స్ ఈ చిత్రంలో ఒక ఎత్తైతే.. ఎప్పటిలాగే కామెడీ డైలాగ్స్, సిద్దు యాక్టింగ్ అన్ని అద్భుతం అనేలా కనబడుతున్నాయి. ప్రిన్స్ కామెడీ విలనిజం, అనుపమ బోల్డ్ లుక్స్, సిద్దు కేరెక్టర్ తో పాటుగా అతని తల్లితండ్రుల కేరెక్టర్ అన్ని సూపర్బ్ అనిపించేలా వదిలిన రిలీజ్ ట్రైలర్ చూసాక టిల్లు స్క్వేర్ పక్కా హిట్ అనేలా ఉంది వ్యవహారం.

డీజే టిల్లు స్క్వేర్ రిలీజ్ ట్రైలర్ లోకి వెళితే ఇది కూడా డీజే టిల్లు మాదిరే ఉంది అనుకున్నా.. ట్రైలర్ మొదలైన కాసేపటికి కామెడీ అందుకోవడంతో.. ఈ చిత్రంతో మళ్ళీ సిద్దు సూపర్ హిట్ కొట్టడం గ్యారెంటి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కనిపిస్తున్నాయి. అనుపమ గ్లామర్ మెయిన్ హైలెట్ అనెలా వుండగా..సిద్దు జొన్నలగడ్డ కామెడీ టైమింగ్స్ అదుర్స్ అంటూ కామెట్స్ చేస్తున్నారు. మరిరేపు శుక్రవారం విడుదల కాబోయే టిల్లుకి పెద్దగా పోటీ లేకపోవడం కలిసొచ్చే అంశం. 

Tillu Square release trailer released :

Tillu Square release trailer review

Tags:   TILLU SQUARE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ