Advertisementt

ఎందుకింత సీక్రెట్ సిద్దు

Thu 28th Mar 2024 10:14 AM
aditi rao hydari  ఎందుకింత సీక్రెట్ సిద్దు
Why secret Sidhu ఎందుకింత సీక్రెట్ సిద్దు
Advertisement
Ads by CJ

నిన్న బుధవారం ఉదయం సిద్దార్థ్-అదితి రావు లు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారనే విషయం సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ అయ్యి కూర్చుంది, ఎప్పటి నుంచో డేటింగ్ లో ఉన్న సిద్దు-అదితిలు వివాహం చేసుకోవడం వింతేమీ కాదు, కానీ సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకోవడమే అందరికి షాకిచ్చే విషయం. కొన్నాళ్ళు తమ రిలేషన్ ని సీక్రెట్ గా మైంటైన్ చేసిన సిద్దు జంట పెళ్ళి ని కూడా అంతే సీక్రెట్ గా చేసుకోవడం ఎవ్వరికి అంతుబట్టడం లేదు.

పెబ్బేరు మండలం శ్రీ రంగాపురంలోని శ్రీ రంగనాయక ఆలయంలో సిద్దార్థ్, అదితి రావు హైదరి వివాహం చేసుకున్నారు. తమిళనాడు నుంచి వచ్చిన పూజారులతో అత్యంత రహస్యంగా ఈ వివాహం జరిగింది అని తెలుస్తోంది. సినిమా షూటింగ్, అందులో భాగంగానే ఈ పెళ్లి అని ముందుగా చెప్పినట్లు సమాచారం. ఆఖరుకి ఆలయంలోని స్థానిక పూజారులను లోనికి అనుమతించని తమిళనాడు సిబ్బంది అంటున్నారు.

చాలా బందోబస్తు మధ్య సీక్రెట్ గా సిద్దు-అదితి మెడలో మూడు ముళ్ళు వేసి ఆ గుడిలో ఏడడుగులు నడిచాడని, ఈ పెళ్లి వెనుక అదితి ఫ్యామిలీ ఉన్నట్లుగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే అదితి రావు హైదరి తల్లి విద్యారావు వనపర్తి సంస్థాన చివరి రాజు జే రామేశ్వర రావు కూతురు. ఇక సిద్దు-అదితి వివాహానికి జే రామేశ్వర రావు వారసులు జే కృష్ణదేవర రావు కుటుంబం హాజరైనట్టుగా తెలుస్తోంది. 

Why secret Sidhu:

Aditi Rao Hydari and Siddharth Tie The Knot In a Secret Wedding

Tags:   ADITI RAO HYDARI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ