Advertisementt

సిద్దార్థ్-అదితి పెళ్ళైపోయిందా?

Fri 05th Apr 2024 07:55 AM
siddharth and aditi rao hydari  సిద్దార్థ్-అదితి పెళ్ళైపోయిందా?
Hero Siddharth and Heroine Aditi Rao Hydari Secretly Married సిద్దార్థ్-అదితి పెళ్ళైపోయిందా?
Advertisement
Ads by CJ

గత కొన్ని రోజులుగా కోలీవుడ్ హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ‌లు డేటింగ్‌లో ఉన్నారనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి. వారి రిలేషన్‌పై ఎప్పటికప్పుడు వార్తలు, ఫొటోలు బయటికి వస్తూనే ఉన్నాయి. మహాసముద్రం సినిమాకు కలిసి పనిచేసిన ఈ ఇద్దరూ.. అప్పటి నుండి చాలా సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. హీరో శర్వానంద్ పెళ్ళికి ఇద్దరూ కలిసి వెళ్లడం కూడా వీరి రిలేషన్‌పై వార్తలు వైరల్ అయ్యేలా చేసింది. అయితే సిద్దు-అదితి తమ బంధాన్ని ఇంకాస్త ముందుకు తీసుకువెళ్లి, మూడు ముళ్ల బంధంగా మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. 

సిద్దార్థ్, అదితి రావు హైదరి రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆరేడు నెలల నుంచి సిద్దార్థ్- అదితిరావు హైదరీ సహజీవనం చేస్తున్నట్టు తెలుస్తున్న నేపథ్యంలో.. తాజాగా ఈ జంట పెళ్లి చేసుకుని ఒకటయ్యారని సమాచారం. వీరి రహస్య వివాహానికి సంబంధించి వార్తలు వైరల్ అవుతున్నాయి. సిద్దు-అదితిలు తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా శ్రీరంగపురం గ్రామంలోని ప్రసిద్ధి చెందిన శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో బుధవారం ఉదయం రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లుగా సోషల్ మీడియాలో వినిపిస్తోన్న వార్త. 

సీక్రెట్‌గా జరిగిన సిద్దార్థ్-అదితిల పెళ్లికి మీడియాతో పాటు ఆలయ సిబ్బంది‌కి కూడా అనుమతిలేదని తెలుస్తోంది. ఈ పెళ్లికి వీరిద్దరికీ చాలా దగ్గరైన వారు మాత్రమే హాజరైనట్లుగా సమాచారం. ఈ వివాహానికి సంబంధించి సిద్దార్థ్, అదితిల నుంచి ఇంత వరకు ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు.

Hero Siddharth and Heroine Aditi Rao Hydari Secretly Married:

Siddharth and Aditi Rao Hydari Marriage News Goes Viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ