నిన్నమొన్నటివరకు హనుమాన్ అనే సినిమా గురించిన ముచ్చట్లు సోషల్ మీడియాలో ఎట్టా వినిపించాయో అందరూ చూసారు. తేజ సజ్జా-ప్రశాంత్ వర్మ మ్యాజిక్ హనుమాన్ ప్యాన్ ఇండియా లో విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ అయ్యింది. జనవరి 12 న పెద్ద హీరోలతో కయ్యానికి కాలుదువ్విన హనుమాన్ థియేటర్స్ లో మూడు వందల కోట్లు కొల్లగొట్టి అందరిని అబ్బుర పరిచింది. అప్పటినుంచి ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలో వీక్షిద్దామా అని థియేటర్స్ లో సినిమా చూసిన వారు కూడా వెయిట్ చేసారు.
హనుమాన్ థియేటర్స్ లో విడుదలైన రెండు నెలలకి జియో సినిమాస్ నుంచి ఓటీటీ హిందీ వెర్షన్ అందుబాటులోకి రాగా.. తెలుగు వెర్షన్ మాత్రం మాత్రం జీ 5 నుంచి అందుబాటులోకి వచ్చింది. కేవలం తెలుగు, హిందీ భాషల్లోనే హనుమాన్ ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చింది. మిగతా భాషల్లో హనుమాన్ ఇంకా ఓటీటీ నుంచి విడుదల కాలేదు. మిగతా భాషలైన తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ హనుమాన్ ఓటీటీ వెర్షన్ పై డిమాండ్ పెరిగిపోయింది.
దానితో ఏప్రిల్ 5 నుంచి మిగతా మూడు భాషల్లోనూ హనుమాన్ ఓటీటీ నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్టుగా ప్రశాంత్ వర్మ ప్రకటించారు. ఈ మూడు భాషల హనుమాన్ ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్ని ప్లస్ హాట్ స్టార్ నుంచి అందుబాటులోకి రానుంది. అంటే హనుమాన్ ఇప్పుడు మూడు ఓటీటీల్లో అందుబాటులో ఉండనుందన్నమాట.