దర్శకుడు శంకర్ మెగా ఫాన్స్ సహనానికి పరీక్ష పెడుతున్నారు. గేమ్ ఛేంజర్ షూటింగ్ ఏళ్ళ తరబడి చేస్తూనే ఉన్నారు. రామ్ చరణ్ ని ఇప్పటివరకు వేరే ప్రాజెక్ట్ లోకి వెళ్లకుండా తన చుట్టూనే తిప్పుకుంటున్నారని మెగా ఫాన్స్ చాలా వర్రీ అవుతున్నారు. ఇక ఇండియన్ 2 షూటింగ్ పూర్తయ్యింది, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది అని కమల్ హాసన్ తాజాగా రివీల్ చేసారు. ఇండియన్ 2 షూటింగ్ పూర్తయితే దానికి రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యొచ్చు కదా.. ఎందుకింతగా శంకర్ ఆలోచిస్తున్నారు.
ఇండియన్ 2 షూటింగ్ తో పాటుగా, ఇండియన్ 3 షూటింగ్ కూడా ఫినిష్ చేసేసారు, మరి గేమ్ ఛేంజర్ షూటింగ్ ఎప్పుడు ఫినిష్ చేస్తారు, అసలు రేపు రామ్ చరణ్ పుట్టిన రోజుకైనా గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ అనౌన్సమెంట్ ఉంటుందా.. శంకర్ సర్ ఇది అన్యాయమండి.. ఫాన్స్ ని ఇంతిలా వెయిట్ చేయించడం అంటూ మెగా అభిమానులు శంకర్ ని తగులుకుంటున్నారు. రామ్ చరణ్ పుట్టిన రోజుకి గేమ్ ఛేంజర్ నుంచి ఫస్ట్ సింగిల్ జరగండి తో పాటుగా ఓ స్పెషల్ పోస్టర్ ఉంటుంది అంటున్నారు.
అది రిలీజ్ డేట్ పోస్టర్ అయితే బావుంటుంది అనేది మెగా ఫాన్స్ కోరిక. మరి శంకర్ గారు ముందుగా ఇండియా 2 డేట్ ఇచ్చాకే, గేమ్ ఛేంజర్ డేట్ ఇస్తారేమో చూడాలి.