అల్లు అర్జున్ బర్త్ డే ఏప్రిల్ 8. గత ఏడాది అల్లు అర్జున్ బర్త్ డే రోజున దర్శకుడు సుకుమార్ తాను అల్లు అర్జున్ తో తెరకెక్కిస్తున్న పుష్ప 2 నుంచి పవర్ ఫుల్ వీడియో ని రిలీజ్ చేసాడు. ఆ వీడియో చిన్నపాటి నిడివితో కూడుకున్నది కాదు. చాలా పెద్ద వీడియో. దానితో అల్లు ఫాన్స్ చాలా అంటే చాలా సర్ ప్రైజ్ అయ్యారు. పుష్ప ద రూల్ నుంచి అల్లు అర్జున్ లుక్ కూడా అభిమానులతో పాటుగా కామన్ ఆడియన్స్ ని తెగ తెగ ఇంప్రెస్స్ చేసింది. మరి దాని తర్వాత ఇప్పటివరకు మళ్ళీ పుష్ప అప్ డేట్ రాలేదు.
మళ్ళీ అల్లు అర్జున్ బర్త్ డే వచ్చేసింది. ఈసారి సుకుమార్ పుష్ప నుంచి ఏం ప్లాన్ చేసారో అనే ఆసక్తి అందరిలో మొదలయ్యింది. అయితే ఈసారి అల్లు అభిమానులు, ప్యాన్ ఇండియా ఆడియన్స్ కోసం సుకుమార్ అదిరిపోయే ట్రీట్ సిద్ధం చేశారనే టాక్ వినిపిస్తోంది. అది పుష్ప ద రూల్ నుంచి టీజర్ కట్ చేస్తున్నారట, ఆగష్టు 15 న విడుదల కాబోతున్న ఈ చిత్రం నుంచి అల్లు అర్జున్ బర్త్ డే కి.. పుష్ప విడుదలయ్యే అన్ని భాషల్లోనూ ఈ టీజర్ విడుదల చేస్తారని తెలుస్తోంది.
దీనితో పాటుగా సుకుమార్, అల్లు అర్జున్ కెరీర్ ల్లో బెస్ట్ మూవీగా నిలిచిన ఆర్య 2 రీ రిలీజ్ అంటున్నారు. ఆర్య 2 రీ రిలీజ్ పై రెండురోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.