పెళ్లంటేనే అదేదో పెద్ద వాడకూడని పదం వాడినట్టుగా కస్సున లేచే తాప్సి పన్ను.. ఇప్పుడు చెప్పాపెట్టకుండా పెళ్లి చేసుకుని హోల్సేల్ షాకిచ్చింది. గత కొన్నాళ్లుగా తాప్సి పన్ను పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో గట్టిగానే వినిపిస్తున్నాయి. తాప్సి ఎప్పటి నుంచో డెన్మార్క్ బ్యాట్మింటన్ ప్లేయర్ మథియాస్ బోను ప్రేమిస్తుంది. అతనితో కలిసి వెకేషన్స్ గట్రా వెళ్లి ఎంజాయ్ చేసినా ఆమె తమ బంధాన్ని సీక్రెట్ గా దాచాలనుకుంది
ఈమధ్యన తాప్సి పన్ను మథియాస్ బోను వివాహం చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన వార్తలు చూసిన ఆమె కస్సున లేచింది. నా పర్సనల్ విషయాలను ఏది పడితే అది రాసేస్తారా.. ఇకపై నా వ్యక్తిగత విషయాలను మీకు చెప్పను అంటూ ఫైర్ అయ్యింది. కానీ ఇప్పుడు సీక్రెట్ గా మథియాస్ బోను వివాహం చేసుకుని అందరూ అదిరిపడేలా చేసింది. మార్చ్ 23 న తాప్సి-మథియాస్ బోను ల వివాహం జరిగిపోయినట్టుగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.
తాప్సి వివాహానికి ఇరు కుటుంభ సభ్యులు, తాప్సికి అత్యంత సన్నిహితులు, స్నేహితులు తప్ప ఇంకెవరు హాజరవలేదు అని, రెండు ఫామిలీస్ మధ్యన, సన్నిహితులు తాప్సి పెళ్లి ఉదయ్ పూర్ వేదికగా అంగరంగ వైభవంగా జరిగిపోయినట్లుగా తెలుస్తుంది. అయితే తాప్సి మాత్రం తన పెళ్లి విషయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఆమె సిస్టర్ షేర్ చేసిన కొన్ని గ్రూప్ ఫొటోస్ మాత్రం సోష మీడియాలో వైరల్ గా మారాయి.