లోకనాయకుడు కమల్ హాసన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 AD చిత్రంలో నటిస్తున్నారు అనగానే అందరిలో కల్కి పై విపరీతమైన అంచనాలు మొదలయ్యాయి. హీరో ప్రభాస్ కి కమల్ హాసన్ విలన్ రోల్ చేస్తున్నారు. ప్రభాస్-కమల్ ఆన్ స్క్రీన్ పై తలపడితే చూడాలనే కోరిక ప్రభాస్ ఫాన్స్ లోనే కాదు కామన్ ఆడియన్స్ లోను మొదలయ్యింది. అసలు ఈ రోల్ కి నాగ్ అశ్విన్ కమల్ హాసన్ ని ఎలా ఒప్పించారో అనే ఆత్రుత అందరిలోనూ ఉంది.
ఇక కల్కిలో కమల్ హాసన్ రోల్ పై తాజాగా కమల్ క్లారిటీ ఇచ్చారు. తాను ప్రభాస్ కల్కి లో జస్ట్ గెస్ట్ రోల్ చేస్తున్నాను అంటూ అందరిని నిరాశపరిచారు. కల్కి లో తన పాత్రకి సంబందించిన షూటింగ్ కూడా పూర్తయ్యింది అంటూ చెప్పడంతో కొంతమంది అభిమానులు నిరాశ చెందినా.. మరికొందరు కమల్ అతిథి పాత్ర చేసినా ఆ ఇంపాక్ట్ కల్కిపై చాలా ఉంటుంది.. ఈ విషయంలో నాగ్ అశ్విన్ తెలివికి హ్యాట్సాల్ఫ్ చెప్పొచ్చు అంటున్నారు.
అంతేకాకుండా కమల్ హాసన్ ఇండియన్ 2, ఇండియన్ 3 సినిమా విషయాలను కమల్ ఈ సందర్భంగా రివీల్ చేసారు. ఇండియన్ 2 షూటింగ్ పూర్తయ్యింది, విడుదలకు సిద్ధమైంది అని చెప్పిన కమల్ ఇండియన్ 3 పై ఇచ్చిన అప్ డేట్ మరింతగా వైరల్ అయ్యింది. ఏమిటంటే ఇండియన్ 3 షూటింగ్ కూడా పూర్తయ్యింది అంటూ కమల్ షాకిచ్చారు. ఇండియన్ 2 విడుదలయ్యాకే దాని సీక్వెల్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలవుతాయి అంటూ చెప్పుకొచ్చారు.