పద్దతికి పట్టు చీర కడితే ఎట్లా ఉంటుందో.. అలాంటి పాత్రలతోనే టాలీవుడ్ లో సినిమాలు చేసిన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టిని వరస వైఫల్యాలు బాగా మార్చేశాయి. చుడీదార్స్, హాఫ్ సారీస్ లో ఎక్కువగా కనిపించిన ఆమె ఇప్పుడు మోడ్రన్ గర్ల్ గా మారిపోయింది. సోషల్ మీడియాని కూడా ఒకప్పుడు పట్టించుకోని కృతి శెట్టి కొన్నాళ్లుగా తరచూ సోషల్ మీడియాలో కనబడుతుంది. కారణం టాలీవుడ్ ఆమెని ఎక్కడ పక్కనపెట్టేస్తుందో అనే భయం ఆమెలో కనబడుతుంది.
ట్రెడిషనల్ గర్ల్ కాస్తా మోడ్రన్ అవతారమెత్తిన కృతి శెట్టి వారానికి ఒకటి కాకపోయినా నెలకో కత్తిలాంటి ఫోటో షూట్ ని వదులుతూ రచ్చ మొదలు పెట్టింది. మోడ్రన్ వేర్ తప్ప తాను సాంప్రాదాయంగా కనిపించను అనేలా ఆమె లుక్స్ ఉంటున్నాయి. లాంగ్ ఫ్రాక్స్, మిడ్డీస్, బుల్లి ఫ్రాక్స్ లో కృతి శెట్టి ఒయ్యారాలు ఒలకబోస్తుంది.
తాజాగా క్రీమ్ కలర్ మోడ్రన్ అవుట్ ఫిట్ లో కృతి శెట్టి ఆల్మోస్ట్ యూత్ మతి పోగొట్టేసింది. లూజ్ హెయిర్ తో కన్ను గీటుతూ కనిపించిన కృతి అందాలు చూస్తే యువతకు నిద్రేలాపడుతుందో. ప్రస్తుతం కృతి శెట్టి లేటెస్ట్ బ్యూటిఫుల్ ఫొటోస్ నెట్టింట సంచలనంగా మారాయి.