గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మూడు లాంగ్వేజెస్ లో గేమ్ ఛేంజర్ మొదలు పెట్టి దాదాపుగా మూడేళ్లు కావొస్తుంది. కానీ ఇంతవరకు గేమ్ ఛేంజర్ షూటింగ్ ముగించింది లేదు, ఆ చిత్రానికి రిలీజ్ డేట్ ప్రకటించింది లేదు. గేమ్ ఛేంజర్ నుంచి గత ఏడాది రామ్ చరణ్ పుట్టిన రోజుకి వదిలిన చరణ్ లుక్ తప్ప ఇంతవరకు అఫీషియల్ అప్ డేట్ ఇవ్వలేదు మేకర్స్. మళ్ళీ రామ్ చరణ్ బర్త్ డే వచ్చేసింది.
రామ్ చరణ్ బర్త్ డే కి గేమ్ ఛేంజర్ నుంచి జరగండి సాంగ్ అంటే ఫస్ట్ సింగిల్ వదులుతున్నారు. అయితే గేమ్ ఛేంజర్ షూటింగ్ ఎప్పుడు ఫినిష్ అవుతుంది అని మెగా అభిమానులు మధనపడుతున్నారు. తాజాగా రామ్ చరణ్ వైజాగ్ లో కీలక షెడ్యూల్ ముగించుకుని హైదరాబాద్ వచ్చాడు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ సరికొత్త షెడ్యూల్ కి సిద్ధం అయ్యింది. అయితే ఈ షూట్ హైదరాబాద్ లో ఏ వి ఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక గేమ్ ఛేంజర్ షూటింగ్ మే నెల నాటికి పూర్తయిపోతుంది అని టాక్. షూటింగ్ పూర్తి కాగానే పోస్ట్ ప్రొడక్షన్ లో శంకర్ నిమగ్నమవుతారని, అందుకే రామ్ చరణ్ కూడా బుచ్చి బాబు దర్శకత్వంలో RC16 మొదలు పెట్టేశారని అంటున్నారు. ఏప్రిల్ నుంచి RC16 రెగ్యులర్ షూట్ లో రామ్ చరణ్ పాల్గొంటారని తెలుస్తుంది. ఇక గేమ్ ఛేంజర్ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నట్లుగా సమాచారం.