Advertisement

ముందుగానే ఓటీటీలోకి గోపీచంద్ భీమా

Sun 24th Mar 2024 01:02 PM
bhimaa  ముందుగానే ఓటీటీలోకి గోపీచంద్ భీమా
Gopichand Bhimaa OTT Release Date Update ముందుగానే ఓటీటీలోకి గోపీచంద్ భీమా
Advertisement

హీరో గోపీచంద్ లేటెస్ట్ మూవీ రెండు వారాల క్రితమే అంటే మార్చ్ 8 మహాశివరాత్రి కి థియేటర్స్ లో విడుదలై క్రిటిక్స్ నుండి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న భీమా ని మేకర్స్ ప్రమోషన్స్ పరంగా అంతగా పట్టించుకోకపోవడంతో థియేటర్స్ లో నామ మాత్రపు కలెక్షన్స్ రాబట్టగలిగింది. ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో రూపొందిన భీమా చిత్రంలో ఇంటర్వెల్ బ్లాక్ ఇంకా క్లైమాక్స్ బావున్నాయి, కామెడీ బాగా వర్కౌట్ అయినా.. మౌత్ టాక్ లేకపోవడం, సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో ఈచిత్రం సో సో కల్లెక్షన్స్ తోనే థియేటర్ రన్ ముగించేసింది.

భీమా మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఫేమస్ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దక్కించుకున్న విషయం తెలిసిందే. భీమా డిజిటల్ హక్కులకి మంచి రేటునే ముట్టజెప్పినట్లు ఇండస్ట్రీలో టాక్ ఉంది. అయితే థియేటర్స్ లో విడుదలైన నెల రోజుల తర్వాతే భీమాని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ తో డిస్ని ప్లస్ హాట్ స్టార్ ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని మరింత ముందుగానే స్ట్రీమింగ్ చేయబోతున్నారట. అంటే ఈ చిత్రం థియేటర్స్ లో విడుదలైన నెల రోజుల లోపే ఓటీటీలోకి తెచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని సమాచారం.

Gopichand Bhimaa OTT Release Date Update:

Bhimaa OTT Rights, OTT Release Date details

Tags:   BHIMAA
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement