సీనియర్ నటి మీనా భర్త విద్యాసాగర్ మరణించినప్పటి నుంచి ఆమె రెండో పెళ్లి విషయంలో సోషల్ మీడియాలో రాని వార్తలేదు. మీనా భర్త మరణం తర్వాత వెంటనే షూటింగ్స్ కి హాజరవడంతో ఆమె రెండో పెళ్లి రూమర్స్ బలంగా ప్రచారంలోకి వచ్చాయి. కూతురు నైనికా తో ఒంటరి ప్రయాణం కష్టమవడంతో మీనా రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్దమవుతుంది అంటూ మాట్లాడుకున్నారు. అంతేకాదు ఓ హీరోతో మీనా రిలేషన్ లో ఉంది అనే ప్రచారమూ జరిగింది. ఈ వార్తలని మీనా ఎప్పటికప్పుడు కొట్టి పారేస్తూనే ఉంది.
కానీ మీనా రెండో పెళ్లి వార్తలు ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి రూమర్స్ క్రియేట్ చెయ్యడం వలన ఆమె ఫ్యామిలీ ఎంతగా బాధపడుతుందో అనేది ఎవ్వరూ ఆలోచించడం లేదు అంటూ మీనా పదే పదే ఈ రూమర్స్ ని ఖండిస్తోంది. తాజాగా మీనా మరోసారి ఈ రకమైన వార్తలపై మండిపడింది. డబ్బు కోసం ఏమైనా రాస్తారా.. సోషల్ మీడియా రోజు రోజుకి దిగజారిపోతోంది. నిజాలు తెలుసుకుని రాయండి. అదే అందరికి మంచిది.
నేను మాత్రమే కాదు, నాలాంటి ఒంటరి మహిళలు చాలామంది ఉన్నారు. ఇలాంటి వార్తల వలన నా కూతురు, నా ఫ్యామిలి ఎంత సఫర్ అవుతుందో మీకు తెలుసా, నాకైతే ప్రస్తుతానికి రెండో పెళ్లి ఆలోచన లేదు. ఫ్యూచర్ లో రెండో పెళ్లి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటానో ఇప్పుడే ఎలా చెబుతాను, నేను గనక రెండో పెళ్లి చేసుకుంటే ముందు మీడియాకి చెప్పి చేసుకుంటాను అంతవరకూ పుకార్లు సృష్టించవద్దు, వాటిని ఎవరూ నమ్మవద్దు అంటూ మీనా రెండో పెళ్లి వార్తలపై ఫైర్ అవుతుంది.