బిగ్ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ SSMB29 ని మొదలుపెట్టబోయే ముందు మహేష్ బాబు తన పిల్లలతో కలిసి వెకేషన్స్ కి వెళ్లిపోయారు. ఆయన సమ్మర్ ట్రిప్, అలాగే డిసెంబర్ లో క్రిష్టమస్ , న్యూస్ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం ఫ్యామిలీతో కలిసి ఏడాదికి రెండు మూడు ట్రిప్స్ వేస్తూ ఉంటారు. అందులో భాగంగానే మహేష్ బాబు నేడు శనివారం తన పిల్లలు సితార, గౌతమ్ లతో కలిసి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. మహేష్ మాస్క్ వేసుకుని తన లుక్ కనిపించకుండా జాగ్రత్తపడిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మహేష్ బాబు తన పిల్లలతో కలిసి ఎప్పటిలాగే దుబాయ్ వెళుతున్నారా.. లేదంటే స్పెయిన్ కి వెళ్ళారా, కాదు అమెరికా ట్రిప్ వేసారా అంటూ ఆరాలు మహేష్ అభిమానులు మొదలు పెట్టేసారు. ఇక మహేష్ బాబు-రాజమౌళి కలయికలో మొదలు కాబోయే SSMB29 పై ఉగాది నుంచి అప్ డేట్స్ బయటికి రావొచ్చనే ప్రచారం జరుగుతుంది. మరి మహేష్ బాబు రాజమౌళి తో SSMB29 సెట్స్ లోకి వెళ్లే ముందు ఇలా పిల్లలతో కలిసి కాస్త సరదాగా ఎంజాయ్ చెయ్యడానికి వెకేషన్ అంటూ ఫ్లైట్ ఎక్కేసారన్నమాట.