Advertisementt

రాజకీయాలపై తారక్ అభిమానుల ఫీలింగ్

Fri 22nd Mar 2024 08:35 PM
ntr fans  రాజకీయాలపై తారక్ అభిమానుల ఫీలింగ్
Tarak fans feeling on politics రాజకీయాలపై తారక్ అభిమానుల ఫీలింగ్
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని టీడీపీలోని చాలామంది కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ అభిమానుల మాటేమో కానీ.. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే బావుంటుంది అనేది చాలామంది ఆలోచన. కానీ ఎన్టీఆర్ మాత్రం రాజకీయాలపై విముఖత చూపుతున్నారు. ప్రస్తుతం తన ప్రయారిటీ సినిమాలే అని తేల్చేస్తున్నా ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై రకరకాల ఊహాగానాలు నడుస్తూ ఉంటాయి. ఆయన ఎక్కడ కనిపించినా మీడియా కూడా రాజకీయాలపై ప్రశ్నించకుండా మానదు.

ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర చిత్రంలో నటిస్తున్నారు. ఈరోజు శుక్రవారం దేవర మేకర్స్ గోవా షూటింగ్ అప్ డేట్ ఇస్తూ ఎన్టీఆర్-కొరటాల శివ ఉన్న వర్కింగ్ స్టిల్ వదిలారు. ఆ పిక్ లో ఎన్టీఆర్ ని చూసిన ఆయన అభిమానులు చెలరేగిపోతున్నారు. గంగి రెడ్డి అల్లుడు ఎట్టున్నాడు అంటూ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు.

అంతేకాదు.. మరికొంతమంది హార్డ్ కొర్ ఫాన్స్ ఎన్టీఆర్ స్టైల్ ని షేర్ చేస్తూ.. ఇప్పుడికిప్పుడు పార్టీ కండువా వేసుకొని రాజకీయాల్లోకి వస్తున్నా అంటే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోదూ.. దేవర 🙏🔥 అంటూ కామెంట్స్ పెడుతూ ఎన్టీఆర్ ని రాజకీయాల్లోకి ముడిపెట్టి కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

Tarak fans feeling on politics:

NTR fans on politics

Tags:   NTR FANS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ