ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ ప్యాన్ ఇండియా చిత్రం తర్వాత రాజమౌళి నుంచి రాబోతున్న చిత్రం అంటే ఊహించుకోవడానికి ఊహలకి కూడా అందం లేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఏదో విధంగా SSMB29 పై ఏవేవో ప్రచారాలు వినిపిస్తూనే ఉన్నాయి. రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావొస్తున్నాయి, స్క్రిప్ట్ రెడీ అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ హాట్ గా ప్రచారంలోకి వచ్చాయి. ఈలోపులో SSMB29 పై మరో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అది మహేష్ బాబు తో మొదలు పెట్టబోయే ఈ చిత్రంలో మహేష్ తో తలపడబోయే విలన్ ని బాలీవుడ్ నుంచి దించుతున్నారని, అది కూడా కండల వీరుడు, స్టార్ హీరో హృతిక్ రోషన్ ని SSMB29 లో నెగెటివ్ రోల్ చెయ్యడానికి ఒప్పించే ప్లాన్ లో రాజమౌళి ఉన్నారనే అంటున్నారు. అయితే ఈమధ్యన ఎన్టీఆర్ వార్ 2 లో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ అయ్యారు. అలాగే ఆయన మహేష్ సినిమా కోసం హృతిక్ వచ్చినా రావొచ్చని అంటున్నారు.
రాజమౌళి చిత్రంలో విలన్ కేరెక్టర్ మాములుగా ఉండదు. బాహుబలిలో రానా కేరెక్టర్ ని చూసాక రాజమౌళి అడిగితే స్టార్ హీరోలు కూడా కాదనలేరు. అందుకే SSMB29 ల విలన్ గా హృతిక్ రోషన్ అనే మాట నిజమో కాదో.. కానీ మహేష్ అభిమానులు మాత్రం యమా ఎగ్జైట్ అవుతూ రాజమౌళి మీ ప్లానింగ్ వేరే లెవల్ అంటూ కామెంట్ చేస్తున్నారు.