వారెవ్వా.. చంద్రబాబు మార్క్ జాబితా!
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న కూటమి.. అభ్యర్థుల విషయంలోనూ ఆచితూచి అడుగులేస్తోంది. గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయిస్తూ.. అటు అసెంబ్లీకి.. ఇటు పార్లమెంట్‌కు అభ్యర్థులను సెలక్ట్ చేశారు. ఇప్పటికే పలువురు 128 మంది అసెంబ్లీ అభ్యర్థులను రెండు జాబితాలుగా ప్రకటించిన టీడీపీ.. తాజాగా మరో 11 మంది అభ్యర్థులను మూడో జాబితాలో ప్రకటించడం జరిగింది. ఇక ఐదుగురు అభ్యర్థులను మాత్రమే ప్రకటించాల్సి ఉంది. కాగా.. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 144 టీడీపీకి, 25 పార్లమెంట్ స్థానాల్లో 13 ఎంపీ స్థానాల్లో పసుపు దళం పోటీచేస్తోంది. చంద్రబాబు తనలోని రాజకీయ చాణక్యుడిని బయటపికి తీశారని.. ఇది బాబు మార్క్ జాబితా అంటూ తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు.
11 మంది అసెంబ్లీ అభ్యర్థులు వీరే..
పలాస : గౌతు శిరీష
పాతపట్నం : మామిడి గోవింద్‌రావు
శ్రీకాకుళం : గొండు శంకర్
శృంగవరపు కోట : కోళ్ల లలిత కుమారి
కాకినాడ సిటీ : వనమాడి వెంకటేశ్వరరావు
అమలాపురం : అయితాబత్తుల ఆనందరావు
పెనమలూరు: బోడె ప్రసాద్
మైలవరం : వసంత కృష్ణప్రసాద్
నరసరావుపేట : చదలవాడ అరవింద్‌బాబు
చీరాల : మద్దులూరి మాలకొండయ్య
సర్వేపల్లి: సోమిరెడ్డి చంద్రమోహన్
13 మంది లోక్‌సభ అభ్యర్థులు వీరే..
శ్రీకాకుళం : కింజరపు రామ్మోహన్‌నాయుడు
విశాఖపట్నం : మాత్కుపల్లి భరత్
అమలాపురం : గంటి హరీష్ మాధుర్
ఏలూరు-పుట్ట మహేష్
విజయవాడ : కేశినేని చిన్ని
గుంటూరు : పెమ్మసాని చంద్రశేఖర్
నరసరావుపేట : లావు శ్రీకృష్ణదేవరాయలు
బాపట్ల : టి. కృష్ణప్రసాద్
నెల్లూరు : వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
చిత్తూరు : దగ్గుమళ్ల ప్రసాద్‌రావు
కర్నూలు : బస్తిపాటి నాగరాజు
నంద్యాల : బైరెడ్డి శబరి
హిందూపురం : బీకే పార్థసారధి