Advertisementt

పరువాల నిధిని పట్టించుకోరే.!

Fri 22nd Mar 2024 11:21 AM
nidhi agarwal  పరువాల నిధిని పట్టించుకోరే.!
Nidhi Agarwal Stunning Looks పరువాల నిధిని పట్టించుకోరే.!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లోకి అక్కినేని హీరోలతో కలసి ఎంట్రీ ఇచ్చి చైతు, అఖిల్ లతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ తో అందాలు ఆరబోతకు దిగిన అందాల నిధి అగర్వాల్ కి ఇక అవకాశాలే అవకాశాలు అనుకున్నారు. కానీ నిధి అగర్వాల్ ఆశించిన అవకాశాలు దొరకలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిధి అగర్వాల్ కి హరి హర వీరమల్లు ఛాన్స్ వచ్చేసింది, లక్కీ అనుకున్నారు. కానీ నిధి అగర్వాల్ కి ఆ చిత్రం షాకుల మీద షాకులిస్తూనే ఉంది. కొద్దిరోజుల మేర అంటే దాదాపుగా 75 శాతం షూటింగ్ జరుపుకున్న హరి హర వీరమల్లు షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయింది.

తాజాగా హరి హర వీరమల్లు డిజిటల్ హక్కులను దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ వారు నిర్వహించిన ఓ ఈవెంట్ కి దర్శకుడు క్రిష్ తో పాటుగా నిధి అగర్వాల్ కూడా హాజరైంది. మెస్మరైజ్ చేసే సారీ లో నిధి అగర్వాల్ ఈ ఈవెంట్ లో సందడి చేసింది. ఆ ఫొటోస్ ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. చక్కని అందం, బ్యూటిఫుల్ లుక్స్, మత్తెక్కించే కళ్ళతో నిధి అగర్వాల్ లుక్స్ సూపర్బ్ గా ఉన్నాయి.

మరి ఇంత అందమైన నిధిని టాలీవుడ్ కానీ, మరే ఇతర భాష దర్శకులు ఎందుకు పరిగణనలోకి తీసుకొవడం లేదో.. ఇంతటి అందాన్ని ఎందుకు మిస్ చేసుకుంటున్నారో అంటుంటే.. అందమే కాదు దానికి ఆవగింజంత అదృష్టం కూడా కలిసి రావాలి అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Nidhi Agarwal Stunning Looks:

Nidhi Agarwal Looks Beautiful In blue saree

Tags:   NIDHI AGARWAL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ