సౌత్ లో ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టిన మొదటి స్టార్ హీరో ప్రభాస్. బాహుబలితో బ్రహ్మాండమైన ప్యాన్ ఇండియా హిట్ కొట్టి ఆ తర్వాత అదే రేంజ్ కథలతో వరసగా సినిమాలు చేస్తున్నారు. ప్రభాస్ తర్వాత అల్లు అర్జున్ సోలో గా పుష్ప తో బిగ్గెస్ట్ ప్యాన్ ఇండియా హిట్ అందుకున్నాడు. ఎన్టీఆర్-రామ్ చరణ్ కలిసి ఆర్.ఆర్.ఆర్ చిత్రం తో కంబైన్డ్ గా హిట్ కొట్టారు. సోషల్ మీడియాలో సౌత్ స్టార్స్ ఒక్కొక్కరికి ఒక్కో ఫాలోయింగ్ ఉంది. మహేష్ బాబు, అల్లు అర్జున్ ఎక్కువగా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పరంగా పోటీ పడుతూ ఉంటారు.
తాజగా అల్లు అర్జున్ సౌత్ ఇండియాలో సెన్సేషనల్ రికార్డు సాధించాడు. సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్ ఏకంగా 25 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్నాడు. దీంతో 25 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న ఫస్ట్ సౌత్ హీరోగా రికార్డులకెక్కాడు. మరి ఇప్పుడప్పుడే అల్లు అర్జున్ ని చేరువవ్వాలంటే మిగతా స్టార్స్ కి కాస్త సమయం పట్టడం గ్యారెంటీ. అటు పుష్ప 2 లాంటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇటు పలు యాడ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్ క్రేజ్ కొలమానంలో కొలవడం కూడా కష్టమే.
ఇక అదే ఇన్స్టాలో అల్లు అర్జున్ తర్వాత స్థానంలో విజయ్ దేవరకొండ (21.3 మిలియన్లు), రామ్ చరణ్ (20.8 మిలియన్లు), దుల్కర్ సల్మాన్ (14.1 మిలియన్లు), యశ్ (13.5 మిలియన్లు), మహేశ్ బాబు (13.4 మిలియన్లు), ప్రభాస్ (11.7 మిలియన్లు), దళపతి విజయ్ (10.8 మిలియన్లు) లకు ఫాలోవర్లు ఉన్నారు.