కోలీవుడ్ హీరోయిన్ అమలా పాల్ మొదటి ప్రేమ పెళ్లిని రద్దు చేసుకుని కొన్నేళ్ల గ్యాప్ తో మళ్ళీ ప్రేమలో పడి గత ఏడాది వివాహం చేసుకుంది. గతంలో తమిళ్ దర్శకుడు విజయ్ ను ప్రేమించి పెళ్లాడింది అమలా పాల్. తర్వాత భర్త విజయ్ కి అమలా పాల్ కి మధ్యన విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత అమలా పాల్ కెరీర్ పై దృష్టి పెట్టింది. సినిమాలు, వెబ్ సీరీస్ లతో బిజీ అయిన అమలా గత ఏడాది సడన్ గా ప్రేమలో ఉన్నట్టుగా ప్రకటించిన కొద్దిరోజులకే బాయ్ ఫ్రెండ్ జగత్ దేశాయ్ తో సింపుల్ గా ఎంగేజ్మెంట్ చేసుకుంది.
జగత్ దేశాయ్ తో ప్రేమలో ఉండి నిశ్చితార్ధం చేసుకున్న అమలా పాల్.. పెళ్లిని కూడా సీక్రెట్ గానే చేసుకున్నప్పటికీ.. గ్రాండ్ గా వివాహ బంధంలోకి అడుగుపెట్టి ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ తర్వాత అమల పాల్ ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని రివీల్ చేస్తూ బేబీ బంప్ ఫొటోస్ ని షేర్ చేసింది. మొన్నటికి మొన్న భర్తతో కలిసి పబ్ లో బేబీ బంప్ తో డ్యాన్స్ చేసింది. ఇక అమలా పాల్ కి ట్విన్స్ పుడతారంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా అమలా పాల్ ఓ షాకింగ్ పోస్ట్ పెట్టింది.
అమలా పాల్ చేతిలో బిడ్డతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటో కింద క్యాప్షన్ 2 హ్యాపీ కిడ్స్ అంటూ పోస్ట్ చెయ్యడంతో.. అమలా పాల్ కు ట్విన్స్ కన్ఫర్మ్ అంటూ నెటిజెన్స్ ఫిక్స్ అయ్యి కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం అమలా పాల్ కి 7వ నెల. మరి అందరూ అనుకున్నట్టుగానే అమలాపాల్ కవలలకు జన్మనివ్వనుందా..? అనేది త్వరలోనే తెలిసిపోతుంది.