Advertisementt

ఊరిస్తోన్న ఉగాది

Thu 21st Mar 2024 11:34 AM
ssmb 29  ఊరిస్తోన్న ఉగాది
Ugadi tollywood updates ఊరిస్తోన్న ఉగాది
Advertisement
Ads by CJ

ఏప్రిల్ 9 న రాబోయే తెలుగు సంవత్సరాది కోసం స్టార్ హీరోల అభిమానులు చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఉగాదికి షడ్రచులతో ఉగాది పచ్చడి ఉన్నట్టుగానే.. ఉగాది పండుగ రోజున స్టార్, మీడియం, చిన్న హీరోలు తమ సినిమాల అప్ డేట్స్ ని వదులుతారు, అభిమానులని ఆనందపరుస్తారు. కాబట్టే ఉగాది కోసం ఫాన్స్ ప్రత్యేకంగా ఎదురు చూస్తారు. మరి వచ్చే ఉగాది తెగ ఊరించేస్తుందండోయ్. సీనియర్ హీరోల దగ్గర నుంచి ప్యాన్ ఇండియా స్టార్స్, మీడియం రేంజ్ హీరోస్ అందరూ సినిమా అప్ డేట్స్ ని రెడీ చేస్తున్నారు.

అందులో ముఖ్యంగా మోస్ట్ అవైటెడ్ ప్యాన్ ఇండియా ఫిల్మ్ SSMB29. మహేష్ బాబు-రాజమౌళి కలయికలో రాబోయే SSMB29 పై ఉగాదికి ఓ ప్రెస్ మీట్ ఉంటుంది అనే టాక్ ఉంది. మరోపక్క సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ-బాబీ కాంబో చిత్ర టైటిల్ తో పాటుగా రిలీజ్ డేట్ కూడా ఈ ఉగాదికే అనౌన్స్ చెయ్యొచ్చు అంటున్నారు. ఇక చిరు విశ్వంభర చిత్రం రీసెంట్ గానే మొదలయ్యింది.. దాని నుంచి అప్ డేట్ ఉండకపోవచ్చు. మరోపక్క నాగార్జున, వెంకటేష్ తమ కొత్త చిత్రాలని ప్రకటించే అవకాశం ఉంది అనే టాక్ వినిపిస్తోంది.

దేవర చిత్రం నుంచి పోస్టర్ రావచ్చంటున్నారు. ప్రభాస్ ప్యాన్ ఇండియా ఫిల్మ్ కల్కి రిలీజ్ డేట్ మే 9 నుంచి పోస్ట్ పోన్ చేస్తూ పోస్టర్ తో సహా ఈ ఉగాదికే ప్రకటించే అవకాశం లేకపోలేదు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుంచి చరణ్ బర్త్ డే ట్రీట్స్ ఈనెల 27 కి వచ్చేస్తాయి కాబట్టి గేమ్ ఛేంజర్ అప్ డేట్ ఉండకపోవచ్చు. అలాగే అల్లు అర్జున్ పుష్ప సర్ ప్రైజ్ కూడా ఏప్రిల్ 8 కే అంటే బన్నీ బర్త్ డే కి ఉగాదికి ఒకేరోజు ముందే వచ్చేస్తుంది.

నాని, నితిన్, రామ్ కొత్త చిత్రాల నుంచి ఉగాది స్పెషల్ అప్ డేట్స్ రావడం పక్కా. ఇక చిన్న సినిమాల పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ ఇవన్నీ కామన్ గా వచ్చేస్తాయి. మరి వచ్చే ఉగాది రోజున ఉగాది పచ్చడిలో ఎన్నిరకాల రుచులు ఆస్వాదిస్తామో.. టాలీవుడ్ నుంచి అన్ని జోనర్స్ సినిమాల అప్ డేట్స్ ని వీక్షిస్తామన్నమాట.

Ugadi tollywood updates:

SSMB 29 To Start On This Special Date

Tags:   SSMB 29
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ