Advertisementt

జపాన్ భూకంపం: తప్పించుకున్న జక్కన్న ఫ్యామిలీ

Thu 21st Mar 2024 09:52 AM
rajamouli  జపాన్ భూకంపం: తప్పించుకున్న జక్కన్న ఫ్యామిలీ
Earthquake hits Rajamouli in Japan జపాన్ భూకంపం: తప్పించుకున్న జక్కన్న ఫ్యామిలీ
Advertisement
Ads by CJ

జపాన్ లో తరచూ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. మొన్నామధ్యన ఎన్టీఆర్ ఫ్యామిలీని తీసుకుని సరదాగా జపాన్ వెళ్ళాడు. ఫ్యామిలీతో వెకేషన్స్ కి వెళ్లిన ఎన్టీఆర్ హైదరాబాద్ కి తిరిగొచ్చిన కొన్ని గంటల్లోనే అక్కడ తీవ్ర భూకంపం సంభవించింది. దానితో ఎన్టీఆర్ ఫాన్స్ షాకయ్యారు. తాజాగా జక్కన్న ఫ్యామిలీ అంతా జపాన్ లోనే ఉంది. రీసెంట్ గానే రాజమౌళి, రమా, కార్తికేయ వాళ్ళు జపాన్ లో ఆర్.ఆర్.ఆర్ స్పెషల్ స్క్రీనింగ్ కోసం జపాన్ వెళ్లిన విషయం తెలిసిందే.

అయితే వీరు జపాన్ లోని ఓ అపార్ట్మెంట్ లో 28 వ ఫ్లోర్ లో ఉండగా.. బిల్డింగ్ కదులుతున్న ఫీలింగ్ వచ్చింది అని, కొంత సమయం తర్వాత అది భూకంపం వలన సంభవించింది అని తెలిసి భయపడ్డామని, మొదటిసారి భూకంపం ద్వారా కలిగిన అనుభూతుని పొందామంటూ కార్తికేయ సోషల్ మీడియా ద్వారా తెలియజెయ్యగానే అభిమానులు కంగారు పడ్డారు. తృటిలో జపాన్ భూకంపం నుంచి తప్పించుకున్న రాజమౌళి ఫ్యామిలీ అంటూ వార్తలు కనిపించడంతో వారు కంగారు పడుతున్నారు.

ఇక కార్తికేయ జపాన్ భూకంపానికి సంబంధించి తన స్మార్ట్ వాచ్ లో వచ్చిన అలెర్ట్ మెసేజ్ ని ఫొటోతో సహా షేర్ చేసాడు.

Earthquake hits Rajamouli in Japan:

Rajamouli expeciences earthquake impact in Japan

Tags:   RAJAMOULI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ