నిన్న మంగళవారం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఓ పొలిటికల్ డైలాగ్ టీజర్ విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ గురించి డైలాగ్ పేలింది. అయితే ఈ పొలిటికల్ డైలాగ్ పై అనేక విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ పొలిటికల్ డైలాగ్ గురించి మట్లాడుతూ.. సినిమాల్లో ఇలాంటి పొలిటికల్ డైలాగ్స్ ని యూస్ చెయ్యడం నాకు నచ్చదు, కానీ హరీష్ శంకర్ బాధ పడలేకనే ఆ డైలాగ్ చెప్పినట్లుగా ఓ మీటింగ్ లో చెప్పుకొచ్చారు.
ఉస్తాద్ లోని ఆ సీన్ గురించి మట్లాడుతూ.. ఒక వ్యక్తి ఒక గాజు గ్లాస్ కింద పడేస్తాడు. అది ముక్కలవుతుంది. ఆ సీన్ షూట్ చేస్తున్నప్పుడు హరీష్ ని అడిగాను. ఇలాంటి సీన్స్ ఎందుకు పెడుతున్నావ్ అని.. దానికి హరీష్ అందరూ మీరు ఓడిపోయావ్ అంటున్నారు. వాళ్లందరికీ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. గాజుకు ఉన్న లక్షణం ఏమిటంటే గాజు పగిలేకొద్దీ పదునెక్కిద్ది, మీ నుంచి మేము ఇలాంటివే కోరుకుంటున్నాము అని చెప్పాడు.
నాకు మాములుగా సినిమాల్లో ఇలాంటి డైలాగ్స్ చెప్పడం అంతగా ఇష్టం ఉండదు. కానీ హరీష్ శంకర్ బాధ పడలేకే ఇలాంటి డైలాగ్స్ చెప్పాను అంటూ పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ మీటింగ్ లో ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి బయటికొచ్చిన పొలిటికల్ డైలాగ్ గురించి చెప్పుకొచ్చారు.