సమంత నటనకు బిగ్ బ్రేకిచ్చి దాదాపుగా ఆరు నెలలవుతుంది. ఖుషి, సిటాడెల్ షూటింగ్స్ తర్వాత సమంత మళ్ళీ ఏ సినిమా సెట్స్ లోను కనిపించలేదు. ఈమధ్యలో సోషల్ మీడియా నుంచి అభిమానులకి టచ్ లో ఉంటూనే తన గ్లామర్ ఫోటో షూట్స్ ని షేర్ చేస్తుంది. గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గకుండా.. అభిమానుల కోసమే గ్లామర్ షో అన్నట్టుగా చెప్పుకొస్తుంది. అటు వ్యక్తిగత జీవితం, ఇటు కెరీర్ గురించిన మాటలతో అందరి చూపు తనపైనే ఉండేలా చూసుకోవడంలో సమంత సక్సెస్ అవుతుంది.
ఇక సోషల్ మీడియాలో ఆమె ఫోటో షూట్స్, నిన్న మంగళవారం ముంబై లో జరిగిన అమెజాన్ ప్రైమ్ స్పెషల్ ఈవెంట్ లో సమంత స్టయిల్, ఆమె కరణ్ జోహార్ కాళ్లని తాకి ఆశీర్వదించమనడం ఇవన్నీ చూసిన వారు సమంత రీ ఎంట్రీ ని హిందీ టార్గెట్ గానే సెట్ చేసుకుంటుంది అంటున్నారు. సమంత కదలికలు, ఆమె ఫోటో షూట్స్ అన్ని హిందీ పై ఫోకస్ చేసినవే అంటున్నారు. అందుకే సమంత చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటుందేమో.
సిటాడెల్ వెబ్ సీరీస్ ఈ ఏడాదే స్ట్రీమింగ్ కి సిద్దమవుతుంది. అది గనక హిట్ అయితే సమంత ముంబైలోనే ఉండిపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు అంటున్నారు నెటిజెన్స్. చూద్దాం సమంత తదుపరి ప్లాన్స్ ఏమిటి అనేది.!