గత ఏడాది ఇదే సమయంలో జాన్వీ కపూర్ సింగిల్ గా హైదరాబాద్ కి వచ్చింది. కారణం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేస్తున్న దేవర చిత్రం ఓపెనింగ్ కార్యక్రమం కోసం జాన్వీ కపూర్ సారీ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అప్పుడు సింగిల్ గా కొరటాల-ఎన్టీఆర్ దేవర ఓపెనింగ్ కి వచ్చిన జాన్వీ కపూర్ ఇప్పుడు మాత్రం ఒంటరిగా రాలేదు.
తండ్రి బోనీ కపూర్ తో కలిసి గత రాత్రి జాన్వీ కపూర్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. ఎందుకో తెలుసు కదా... ఈరోజు బుధవారం జరగబోయే రామ్ చరణ్ మూవీ ఓపెనింగ్ కోసం. రామ్ చరణ్-బుచ్చి బాబు కలయికలో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతున్న RC16 లో జాన్వి కపూరే హీరోయిన్. ఈరోజు ఉదయం 10 గంటలకు జరగబోయే ఈ చిత్ర ఓపెనింగ్ కార్యక్రమానికి జాన్వీ కపూర్ హైదరాబాద్ వచ్చింది. అయితే ఈసారి ఒంటరిగా కాదు తండ్రి బోని కపూర్ ని వెంటబెట్టుకుని మరీ వచ్చింది.
జాన్వీ కపూర్, బోని కపూర్ ఎయిర్ పోర్ట్ లో నడిచొస్తున్న వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అప్పుడు సింగిల్ గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ఇప్పుడు తండ్రిని వెంట తీసుకుని దిగింది అంటూ సరదాగా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం హైదెరాబాదులో రామ్ చరణ్-బుచ్చి బాబీ కాంబో మూవీ RC16 పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రంలో జాన్వీ పాల్గొంటుంది.