రామ్ చరణ్ ఈరోజు వరకు వైజాగ్ లోనే ఉన్నాడు. అక్కడ గేమ్ ఛేంజర్ షూటింగ్ లో పాల్గొన్న రామ్ చరణ్ కి అడుగడుగునా అభిమానులు నీరాజనాలు అందించారు. ఇక వైజాగ్ షెడ్యూల్ లో ప్రతిసారి గేమ్ ఛేంజర్ లోని రామ్ చరణ్ లుక్స్ లీకైనట్టుగానే ఈసారి కూడా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ లుక్ లీకై సెన్సేషన్ క్రియేట్ చేసింది. చరణ్ గవర్నెమెంట్ ఆఫీసర్ గా సూపర్ స్టైలిష్ గా కనిపించాడు. ఇక అక్కడ గేమ్ ఛేంజర్ షెడ్యూల్ పూర్తి కావడంతో చరణ్ హైదరాబాద్ చేరుకున్నాడు. రేపు బుధవారం ఉదయం RC16 పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో జరగబోతున్నాయి.
అయితే ఉపాసన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియో లో రామ్ చరణ్, ఉపాసనలు కలిసి వైజాగ్ బీచ్ లో అంటే విశాఖ సాగర తీరంలో తమ కుమార్తె క్లింకారతో కలిసి ఆడుకుంటున్నారు. రామ్ చరణ్ తన కూతురు తో కలిసి ఎంతగా ఎంజాయ్ చేస్తున్నాడో ఆ వీడియో చూస్తే అర్ధమవుతుంది. బేబీ ని ఎత్తుకుని చరణ్ చిన్నపిల్లడిలా మారిపోయి నీళ్ళల్లో ఆడుకుంటున్నాడు.
క్లింకార తో ఎప్పుడు వెకేషన్ కి వెళ్లినా ఎయిర్ పోర్ట్ లో చూడడం తప్ప ఇలా వీడియో రూపంలో ఎప్పుడూ ఇవ్వలేదు, ఇప్పడు కూడా క్లింకార మొహం కనిపించకుండా జాగ్రత్త పడుతూనే ఈ వీడియో తీశారు. ఇక ఉపాసన ఆ వీడియోతో పాటుగా.. వైజాగ్ మా మనసులని దోచేసింది. క్లింకారతో కలిసి ఫస్ట్ బీచ్ ఎక్స్ పీరియన్స్ అంటూ పోస్ట్ చేసిన వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. అదే వీడియో లో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తి చేసుకుని వస్తున్న సందర్భంలో అభిమానులు ఆయన్ని గజమాలతో సత్కరించిన క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి.