అనుపమ పరమేశ్వరన్ అంటే అచ్చ తెలుగు అమ్మాయిగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ముద్రవేసుకుంది. సాంప్రదానికి మారుపేరు అన్నట్టుగా ఒకప్పుడు ఆమె లుక్స్, ఆమె వేషధారణ ఉండేది. చాలా సినిమాల్లో అనుపమ పరమేశ్వరన్ అలాగే కనిపించింది. గ్లామర్ షో అంటూ హడావిడి చెయ్యలేదు. కానీ కొన్నాళ్లుగా అనుపమ పరమేశ్వరన్ లుక్ మార్చేసింది. గ్లామర్ షో స్టార్ట్ చేసింది. సారీ లోను అందాలు చూపించేందుకు ఉవ్విళ్లూరుతోంది. ముద్దులు పెట్టడానికి కూడా వెనుకాడడం లేదు.
తాజాగా సిద్దు జొన్నలగడ్డతో కలిసి టిల్లు స్క్వేర్ చిత్రంలో నటిస్తున్న అనుపమ పరమేశ్వరన్ హద్దులు దాటి నటించడం పట్ల ఆమె అభిమానులు చాలా ఫీలయ్యారు. ఆమెని ట్రెడిషనల్ గా చూసి ఇప్పుడు ఇలా చూసేసరికి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇదే ప్రశ్నని మీడియా వారు అనుపమని టిల్లు స్క్వేర్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో అడిగారు. దానికి అనుపమ ఇచ్చిన ఆన్సర్ చూసి అభిమానులు నిజంగా షాకయ్యే ఉంటారు. అనుపమ ఆన్సర్ ఇస్తూ.. మీకు బిర్యానీ అంటే ఇష్టమని ప్రతి రోజు బిర్యానీ తినలేము కదా..? బోర్ వచ్చేస్తుంది. అలాగే నాకు కూడా రొటీన్ పాత్రలు చేసి చేసి ఇప్పుడు బోర్ వచ్చింది. అందుకే ఇలా కొత్తగా ట్రై చేశా.. అని తెలిపింది అనుపమ.
త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో అ..ఆ.. సినిమా చేసినప్పుడు నా వయసు 19 ఏళ్లు, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 9 ఏళ్లు అవుతుంది. ఈ తొమ్మిది ఏళ్లలో చేసిన పాత్రలే మళ్లీ మళ్లీ చేయాలని అనుకోవడం తప్పు కదండీ.. నేను కూడా మనిషినే కదండీ.. నేను నటిగా నాకు కంఫర్ట్ బుల్ గా ఉండే పాత్రలే చేస్తున్నాను. అలాగే ఈ సినిమాలో నాకు వచ్చిన లొల్లి పాత్రను వదులుకోవడం ఇష్టం లేదు. ఒక కమర్షియల్ సినిమాలో ఇంత మంచి పాత్ర దొరకదు.. కావాలంటే నేను రాసిస్తా.. అలాంటి పాత్రను నేను వదులుకోవాలనుకోవడం లేదు.
అంతేకాకుండా యాక్టర్ గా నా లిమిటేషన్స్ నాకు ఉన్నాయి. నా బాధ్యత ప్రకారం నేను నటించాను అంటూ అనుపమ చెప్పిన సమాధానం ఆమె అభిమానులు ఎలా తీసుకుంటారో కాస్త వేచి చూడాల్సిందే.