పూజ హెగ్డే బుట్టబొమ్మగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుడి కట్టించుకుంది. గ్లామర్ పరంగా కాంప్లిమెంట్స్ అందుకున్న పూజ హెగ్డే స్టార్ హీరోస్ సరసన జోడి కట్టింది. పవన్ కళ్యాణ్ తప్పితే తెలుగులో అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, మహేష్ బాబు ఇలా ప్రతి హీరో సినిమాలో నటించింది. టాప్ పొజిషన్ కి చేరుకునే సమయంలో హ్యాట్రిక్ డిజాస్టర్స్ పూజ హెగ్డే కెరీర్ ని అమాంతం పడేశాయి. తర్వాత సౌత్ అవకాశాలు తగ్గిపోవడంతో పూజ హెగ్డే ముంబైలోనే ఉండిపోయింది. అక్కడ హిందీ అవకాశాలు కోసం ట్రై చేస్తుంది.
అయితే పూజ హెగ్డే కోరుకున్న హిందీ అవకాశాలు ఆమె చెంతకు చేరాయి. ఆమెకి నార్త్ ఇండస్ట్రీ రెడ్ కార్పెట్ పరుస్తుంది అనేలా ఆమెని ఆఫర్స్ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే షాహిద్ కపూర్ హీరోగా మొదలైన దేవా సెట్స్ లోకి అడుగుపెట్టింది. ముంబైలో జరుగుతున్న సెకండ్ షెడ్యూల్ లో పూజ హెగ్డే ఇటీవల పాల్గొంది. ఓ యువ పోలీసు అధికారి కేసును దర్యాప్తు చేసే సమయంలో ఎదురైన సవాళ్ల చుట్టూ తిరిగే స్టోరీతో రూపొందుతున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే క్రేజీ రోల్ పోషిస్తుంది.
అంతేకాకుండా కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న కొత్త మూవీలో కూడా పూజ హెగ్డే ఛాన్స్ దక్కించుకుంది అనే టాక్ ఉంది. మరోపక్క అహాన్ శెట్టి హీరోగా నటిస్తున్న సంకీలోనూ పూజ హెగ్డే హీరోయిన్ గా ఎంపికైంది. మరి ఈ చిత్రాల్లో ఏ ఒక్కటి వర్కౌట్ అయినా.. పూజ హెగ్డే హిందీలో నిలదొక్కుకోవడం ఖాయం. ఈమధ్యలో పూజ హెగ్డే కి సౌత్ నుంచి పిలుపొస్తే రెక్కలు కట్టుకుని వాలిపోవడానికి రెడీగా ఉంది.