యంగ్ టైగర్ ఎన్టీఆర్ గోవా వెళ్ళెందుకు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కి వచ్చారు. ఆయన గోవాకి వెళ్ళేది ఏ వెకేషన్ నో ఎంజాయ్ చెయ్యడానికి కాదండోయ్... దేవర షూటింగ్ కోసం. ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ గా గత ఏడాది మార్చ్ లో మొదలైన దేవర చిత్రం ఈ ఏప్రిల్ కి విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వలన దేవర ని అక్టోబర్ 10 కి పోస్ట్ పోన్ చేసి.. మిగతా షూటింగ్ ప్రస్తుతం కూల్ గా చేసుకుంటున్నారు. దేవర షూటింగ్ స్టార్ట్ అయినప్పటినుంచి అస్సలు బ్రేకులు వేయకుండా కొరటాల చిత్రీకరిస్తున్నారు.
అయితే ఎక్కువశాతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే దేవర కోసం సెట్స్ నిర్మించి అందులోనే మేజర్ పార్ట్ షూటింగ్ ని కొరటాల శివ చుట్టేసినా.. కొన్ని కీలక సన్నివేశాల కోసం గతంలో ఓసారి గోవాకి వెళ్ళింది దేవర టీమ్. ఎన్టీఆర్-హీరోయిన్ జాన్వీ కపూర్ లపై కొన్ని రొమాంటిక్ సన్నివేశాలని గోవాలో చిత్రీకరించారు. ఆ తర్వాత హైదరాబాద్ లోనే మరొకొన్ని షెడ్యూల్స్ ని ముగించిన కొరటాల మరోసారి దేవర పాట చిత్రీకరణ కోసం హీరో ఎన్టీఆర్ తో సహా గోవాకి బయలు దేరారు.
గోవాలోని బ్యూటిఫుల్ లొకేషన్స్ లో దేవర పాటని ఎన్టీఆర్-హీరోయిన్ జాన్వీ కపూర్ లపై చిత్రీకరించేందుకు ప్లాన్ చేసారు. అందులో భాగంగానే ఎన్టీఆర్ ఎయిర్ పోర్ట్ కి వచ్చారు. ఆయన ఫ్లైట్ లో గోవాకి వెళుతున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.