నందమూరి బాలకృష్ణ తన వారసుడు మోక్షజ్ఞని సినిమాల్లోకి ఎప్పుడెప్పుడు తీసుకువస్తారు అని నందమూరి అభిమానులతో పాటుగా కామన్ ఆడియెన్ కూడా ఎదురు చూస్తున్నారు. మోక్షజ్ఞ హీరో గా ఎంట్రీ ఇచ్చేందుకు పర్ఫెక్ట్ ఫిగర్ లోకి మారిపోయాడు. ఒకప్పుడు హీరో మెటీరియల్ లా లేడు అన్నవారే ఇప్పుడు హీరో మాదిరి గా మారిన మోక్షు ని చూసి షాకైపోతున్నారు. అందుకే మోక్షజ్ఞ హీరో అయ్యే క్షణాలు కోసం ఎదురు చూపులు ఎక్కువయ్యాయి.
కానీ బాలయ్య మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశంపై ఇంకా ముహూర్తం పెట్టడం లేదు. ప్రతిసారి బాలయ్య బర్త్ డే కోసం ఎదురు చూడడం, మోక్షజ్ఞ ఎంట్రీ అప్ డేట్ పై ఆశపడడం, ప్రతిసారి డిస్పాయింట్ అవడం చూస్తూనే ఉన్నాము. ఇక మోక్షజ్ఞని హీరోగా ఇంట్రడ్యూస్ చేసేది డైరెక్టర్ పూరి అన్నారు. తర్వాత బోయపాటి అన్నారు, ఆ తర్వాత బాలయ్యే కొడుకు డెబ్యూ చిత్రాన్ని తెరకెక్కిస్తారని ఏవేవో ఊహాగానాలు నడిచాయి. కానీ అందులో ఏది నిజం కాలేదు.
తాజాగా మోక్షజ్ఞని ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతని మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తీసుకున్నారని, ఆయన్ని బాలయ్య తన కొడుకు సినిమా కోసం సజెస్ట్ చేసాడని అంటున్నారు. బాలయ్య కి సింహ, లెజెండ్, అఖండ లతో బ్లాక్ బస్టర్ హ్యాట్రిక్స్ ఇచ్చారు. ఇప్పుడు మోక్షజ్ఞ కి డెబ్యూతోనే సక్సెస్ అందించేలా బోయపాటి పనులు మొదలు పెట్టారనే టాక్ వినిపిస్తోంది. జూన్ 10 న బాలకృష్ణ బర్త్ డే రోజు మోక్షజ్ఞ-బోయపాటిల కాంబోపై అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశం ఉంది అని తెలుస్తోంది.