ప్రగ్యా జైస్వాల్ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పుదామని కలలు కన్న బ్యూటీ. సన్నగా నాజూగ్గా గ్లామర్ చూపించినా ప్రగ్యా జైస్వాల్ కి అదృష్టం కలిసి రాలేదు. అన్నీ ఉన్నా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలంటారు. అదే ప్రగ్య జైస్వాల్ కెరీర్ లో మిస్ అయ్యింది. అందానికి అందం, గ్లామర్ కి గ్లామర్ ఆమె సొంతం. కానీ కెరీర్ మాత్రం ఆశాజనకంగా లేదు. అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత ఆమెకి సీనియర్ హీరోల అవకాశాలు క్యూ కడతాయని అనుకున్నారు.
అటు నుంచి చూసినా ప్రగ్యా జైస్వాల్ కి అవకాశాలు అందలేదు. దానితో సోషల్ మీడియాని నమ్ముకుని తరచూ స్పెషల్ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ వస్తుంది. గ్లామర్ గా వయ్యారాలు వలకబోస్తుంది. ఎంతగా గ్లామర్ షో చేసినా ప్రగ్యా జైస్వాల్ కి ఆ సినిమా అవకాశం అందనంత దూరంలో ఉండిపోతుంది అనేలా ఉంది పరిస్థితి. తాజాగా ప్రగ్యా జైస్వాల్ ఇన్స్టాలో షేర్ చేసిన పిక్స్ చూస్తే మతిపోతుంది.
ఇంత అందాన్ని సినిమా ఇండస్ట్రీ ఎందుకుపట్టించుకోవడం లేదబ్బా అనుకుంటారు. క్రీమ్ కలర్ మోడ్రెన్ అవుట్ ఫిట్ లో మత్తెక్కించే చూపులతో ప్రగ్యా సోయగం మాములుగా లేదు. ఎంత అందం.. అద్భుతమైన గ్లామర్ ఆమె సొంతం.. అంటూ నెటిజెన్స్ ప్రగ్యా జైస్వాల్ ఫొటోస్ ని చూసి కామెంట్స్ చేస్తున్నారు.