రామ్ చరణ్ ప్రస్తుతం కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ షూటింగ్ కోసం వైజాగ్ వెళ్లారు. అక్కడ గేమ్ ఛేంజర్ భారీ షెడ్యూల్ ముగించుకుని హైదరాబాద్ రాగానే.. ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబు తో కలిసి RC16 పూజా కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తోంది. మార్చి 20 నుంచి RC16 పట్టాలెక్కబోతోంది అనే వార్త ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే రామ్ చరణ్ కోసం బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ని తీసుకొచ్చాడు బుచ్చి బాబు.
ఇప్పుడు RC16 లోకి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ ఎంటర్ అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఓ స్పెషల్ రోల్ ఉందని.. ఈ పాత్రలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ని బుచ్చిబాబు సంప్రదించే పనిలో ఉన్నట్లుగా సమాచారం. RC16 పాన్ ఇండియా మార్కెట్ లో విడుదల చేసేందుకే బుచ్చిబాబు ఇలా హిందీ యాక్టర్స్ ని భాగం చేస్తున్నాడని తెలుస్తుంది. అలాగే విలన్ రోల్ కోసం యానిమల్ చిత్రంలో విలన్ గా మెప్పించిన బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ని తీసుకోబోతున్నట్టుగా కూడా టాక్ నడుస్తుంది.
RC16 చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.