గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం కెరీర్ ని పక్కనబెట్టి అమ్మతనాన్ని ఆస్వాదిస్తోంది. గత ఏడాది ఇలియానా బిడ్డకి జన్మనిచ్చింది. ఆతర్వాత ఆమె తన భాగస్వామి మైకేల్ గురించి రివీల్ చేసింది. అయితే ఇలియానా తల్లిని కాబోతున్నట్లుగా ప్రకటించి, భర్త గురించి చెప్పకపోయేసరికి అందరూ ఇలియానాని ట్రోల్ చేసారు. పెళ్లి కాకుండానే ఆమె తల్లయ్యింది అంటూ సోషల్ మీడియా వేదికగా ఆమెని ట్రోల్ చేసారు. గతంలోనూ ఇలియానా బ్రేకప్ అయ్యి డిప్రెషన్ లోకి వెళ్ళినప్పుడు కూడా ఇలియానాని చాలామందే విమర్శించారు.
తాజాగా తనని విమర్శించినవారిపై ట్రోల్ చేసిన విషయాలపై ఇలియానా స్పందించింది. తాను ప్రెగ్నెంట్ అయినా పని చేయాలనుకున్నాను, కానీ పరిస్థితులు సహకరించకపోవడంతో ఆ డెసిషన్ ని వెనక్కి తీసుకున్నాను. అప్పుడు మా అమ్మే నాకు అండగా నిలబడింది. బిడ్డ పుట్టిన తర్వాత ఒత్తిడికి గురయ్యాను. అప్పుడు నా భాగస్వామి మైకేల్ నాకు తోడుగా నీడగా నిలిచాడు. మా బంధం గురించి నేను ఓపెన్ గా చెప్పాలనుకోవడం లేదు.
అలా కొన్ని విషయాలు ఓపెన్ గా మాట్లాడి విమర్శలపాలయ్యాను. నన్నేమన్నా భరిస్తాను, కానీ నా భాగస్వామిని, నా కుటుంబాన్ని ఎవరన్నా ఏమైనా అంటే తట్టుకోలేను, తప్పుగా మాట్లాడితే భరించలేను అంటూ ఇలియానా తనపై, తన ఫ్యామిలీపై జరిగిన ట్రోలింగ్ పై స్పందించింది.